S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/13/2018 - 12:48

ముంబయి: పార్టీ పేరు చెప్పి అవకతవకలకు పాల్పడుతున్నారని ఇద్దరు సీనియర్ నేతలకు శివసేన ఉద్వాసన పలికింది. జగదీష్ షెట్టి, దీపక్ సావంత్‌లను రాజీనామా చేయాల్సిందిగా ఉద్దవ్ థాకర్ ఆదేశించారు.

08/13/2018 - 12:46

న్యూఢిల్లీ: లోకసభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్టప్రతి రామనాథ కోవింద్ సంతాపం ప్రకటించారు. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, సోనియాగాంధీ , రాహుల్‌గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు తదితరులు సంతాపం తెలిపారు.

08/13/2018 - 12:42

తిరువనంతపురం: కేరళలో సంభవించిన వరద నష్టం అపారం అని అధికారులు అంచనా వేశారు. దాదాపు రూ.8,316 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 10 వేల కిలోమీటర్ల మేరకు రోడ్లు ధ్వంసమయ్యాయి. 20 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 211 చోట్ల కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని పది జిల్లాలపై వరద నష్టం ప్రభావం అధికంగా ఉంది.

08/13/2018 - 12:49

కోల్‌కతా: లోకసభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ సోమవారంనాడు కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నలభై రోజుల క్రితం ఆయన మెదడులో నరాలు చిట్లి పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జి అయిన ఆయనను గత మంగళవారంనాడు మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం స్వల్పంగా గుండెపోటు రావటంతో పాటు ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారంనాడు మృతిచెందారు.

08/13/2018 - 04:18

హైదరాబాద్: 2030 నాటికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలుస్తోందని కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ అన్నారు. ఆదివారం ఉప్పల్‌లో ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పిన సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ (సీడీఎప్‌డీ) నూతన క్యాంపస్‌ను ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్.

08/13/2018 - 04:15

భోపాల్, ఆగస్టు 12: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దూకి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు ఆధ్యాత్మిక గురువులు (స్వామీజీలు) సిద్ధమవుతున్నారు. దీంతో ఈయేడాది చివరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. గత ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో ఐదుగురు మత గురువులకు సహాయ మంత్రి హోదా ఇచ్చిన నేపథ్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

08/13/2018 - 04:15

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఆర్టికల్ 35ఏ ఉన్నా, లేకున్నా జమ్మూకాశ్మీర్‌కు భారత్‌కు మధ్య ఎలాంటి సమస్య ఉండదు. ఆర్టికల్ 35ఏ అనేది పెద్ద సమస్య కాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, జమ్మూకాశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్ రామ్‌మాధవ్ స్పష్టం చేశారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్యను పది లక్షలకు పెంచాలన్నది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

08/13/2018 - 04:14

బెంగళూరు, ఆగస్టు 12: చంద్రయాన్-2ను వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో ప్రయోగించనున్నారు. వాస్తవానికి ఈ ఏడాదే చంద్రయాన్-ను ప్రయోగించాల్సి ఉండగా, డిజైన్‌లో కొన్ని మార్పులు చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాదికి మార్చినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.

08/13/2018 - 04:13

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలో ముస్లిం వర్గాలకు భద్రతాపరంగా చేకూర్చే అంశాలపై చర్చించేందుకు వీలుగా తమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కోరింది. ఆదివారం ఇక్కడ ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎస్‌ఓఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సమావేశంలో జాతీయ భద్రతా అంశాల్లో ముస్లింలకు మేలు చేకూర్చేందుకు తమను కూడా భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేసింది.

08/13/2018 - 04:35

రాజ్‌కోట్, ఆగస్టు12: యువత ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, శక్తి యుక్తులతోనే దేశాభ్యుదయం సాధ్యమవుతుందని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు హితవుపలికారు. 751వ నంబరు జాతీయ రహదారికి అనుబంధంగా రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33.3 కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డుకు గుజరాత్‌లోని భావ్‌నరగ్‌లో ఆదివారం నాడాయన శంకుస్థాపన చేశారు.

Pages