S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/13/2018 - 04:00

చండీగడ్, ఆగస్టు 12: మహిళలు గృహ రంగంలోనే కాకుండా, అన్ని విభాగాల్లో ఉత్తమ మేనేజర్లుగా రాణిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. మహిళలకు మేనేజిమెంట్‌లో ఉన్నత స్థాయి డిగ్రీ లేకపోవచ్చని, కాని ఇంటా బయట ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేయాలన్నారు.

08/13/2018 - 02:02

జార్ఖండ్‌లోని కుంతి జిల్లా జాబ్రా గ్రామంలో తమ ఇంటి ముందు నిస్సహాయంగా కూర్చున్న 60 ఏళ్ల సుగ్గీ ముంయన్, ఆమె కుమారుడు మంగల్ ముండా. ముండా గిరిజనులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడంతో గ్రామం దాదాపుగా నిర్మానుష్యమైంది. అడవితల్లిని నమ్ముకొని బతికే ఆదివాసీలు క్రమంగా అడవికి దూరమవుతున్నారనడానికి ఈ గ్రామమే ఉదాహరణ. ఊరిని విడిచి వెళ్లిన వారు మళ్లీ ఎప్పుడు వస్తారో? అసలు వస్తారో? రారో?

08/13/2018 - 01:56

న్యూఢిల్లీ, ఆగస్టు 12: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ చోటు లేకుండా పొత్తు పెట్టుకునే పార్టీల కూటమి వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ హెచ్చరించారు. బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంపై ఆయన స్పందించారు.

08/13/2018 - 01:54

న్యూఢిల్లీ, ఆగస్టు 12: భారత ప్రధాని నరేంద్రమోదీ అచ్చేదిన్ అంటూ గొప్పగా ప్రకటించుకున్న పథకం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గందరగోళమైన లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తప్పుబట్టారు.

08/13/2018 - 01:54

న్యూఢిల్లీ, ఆగస్టు 12: తుపానులు, ప్రకృతివైపరీత్యాల వల్ల దేశంలోని కోస్తా తీరంలో 33 శాతం భూభాగం కోతకు గురవుతోంది. అదే సమయంలో 29 శాతం మేర సముద్ర తీరం, నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఇసుక మేటలు వేస్తున్నాయి. సముద్ర తీరం వెంట ఎడాపెడా సాగుతున్న అక్రమ నిర్మాణాల వల్ల కూడా కోస్తా తీరం వెంట భూభాగం కోతలకు గురవుతోంది.

08/13/2018 - 01:53

న్యూఢిల్లీ, ఆగస్టు 12: రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న సమయంలో నిర్ణీత వ్యవధలోపల గమ్యానికి చేరుకునేందుకు గరిష్టస్థాయిలో అనుమతించిన వేగంతోనే రైళ్లను నడపాలని రైల్వే శాఖ డ్రైవర్లను ఆదేశించింది. అంతేకాని అనుమతించిన వేగం కంటే ఎక్కువ వేగంతో రైళ్లను నడపరాదని రైల్వే శాఖ డ్రైవర్లను ఆదేశించింది.

08/13/2018 - 01:52

న్యూఢిల్లీ, ఆగస్టు 12: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగిన సమాచారాన్ని పిటిషన్‌దారుడికి ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)ను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) నిలదీసింది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే, ఏకపక్ష నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.

08/13/2018 - 01:52

న్యూఢిల్లీ, ఆగస్టు 12: భూగర్భ జలాలు బ్యాంకుల్లో దాచుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సమానమని, తప్పనిసరి పరిస్థితుల్లోనే వీటిని వినియోగించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వానికి సూచించింది. భూగర్భ జలాలను వివిధ రకాల పేరిట ఎడాపెడా వినియోగిస్తుండడం వల్ల భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

08/13/2018 - 01:51

న్యూఢిల్లీ, ఆగస్టు 12: భారత్ చైనా సరిహద్దుల భద్రత కో సం అహర్నిశలు పనిచేస్తున్న ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ (ఐటీబీపీ)లోపనిచేసే జవాన్లకు శుభవార్త. జవాన్ల పుట్టినరోజు సగంరోజు విధులకు హాజరుకాకుండా సెలవు ఇవ్వాలని ఐటీబీపీ నిర్ణయించింది. యూనిఫార్మ్ లేకుండా ఉండేందుకు వీలు ను కల్పిస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు.

08/13/2018 - 01:50

బెంగళూరు, ఆగస్టు 12: ప్రజల్లో శాస్తస్రాంకేతిక అంశాల పట్ల అవగాహన పెంచడంతోపాటు పాఠశాలల విద్యార్థులకు శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రత్యేకంగా ఒక టీవీ చానెల్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.

Pages