S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/13/2018 - 01:50

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశ వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో వంద లోక్‌సభ సీట్లలో పోటీ చేయాలనే లక్ష్యంతో ఆప్ ఆద్మీ పార్టీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆప్ పార్టీ నిర్ణయించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ 400 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది.

08/13/2018 - 01:49

అంతర్జాతీయ గజరాజు దినోత్సవ సందర్భంగా గౌహతిలోని అసోం రాష్ట్ర జంతు ప్రదర్శనశాలలో ఏనుగులకు
చెరకు ముక్కలు తినిపిస్తున్న చిన్నారులు.

08/13/2018 - 01:39

శ్రీనగర్, ఆగస్టు 12: శ్రీనగర్‌లోని బటమలూ ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున బుల్లెట్ల మోతతో దద్దరిల్లింది. ఒక ఇంట్లో ఉగ్రవాదులు దాగివున్నారనే కచ్చితమైన సమాచారం మేరకు దియార్‌వనీ ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. ఇది గమనించిన ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా, మరో ఐదుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

08/13/2018 - 04:40

తిరువనంతపురం: కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల బీభత్సం పలువురి జీవితాలను ఛిద్రం చేశాయి. వారి జీవన స్థితితగులను తీవ్రంగా దెబ్బతీసింది. భవిష్యత్ ఎలా ఉంటుందో అనే తీవ్ర ఆందోళన వారిలో నెలకొల్పింది. కేరళలో కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 40 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

08/13/2018 - 01:29

కోచి, ఆగస్టు 12: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతమైన కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ ముఖ్యమంత్రి పినరయ విజయన్‌తో కలిసి విహంగ వీక్షణం జరిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కేరళలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు సంభవించాయన్నారు.

08/13/2018 - 01:27

ఆగ్రాలోని తాజ్ మహల్‌ను ఆదివారం సందర్శించిన ఐక్యరాజ్య సమితి
జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మరియా ఫెర్నాండా ఎస్పినొసా గార్సె.

08/13/2018 - 00:41

కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఎనభై తొమిదేళ్ల సోమ్‌నాథ్ చటర్జీ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

08/12/2018 - 04:27

బెంగళూరు: మతం పేరుతో ఘర్షణలకు పాల్పడడం సరికాదని, మధ్యప్రాచ్యంలోముస్లింలలోని వర్గాలు హింసాత్మక ఘటనలకు పాల్పడడం మానుకోవాలని టిబెట్ మతగురువు దలైలామా అన్నారు. మానవుల మధ్య సోదర భావం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం ద్వారా శాంతి, సామరస్యతను సాధించవచ్చని ఆయన అన్నారు. సిరియా, ఆఫ్గనిస్తాన్‌తో ఇస్లామిక్‌దేశాలు. పవిత్ర ఖురాన్ ప్రవచనాలను అక్కడి ప్రజలు పాటిస్తారు. రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేస్తారు.

08/12/2018 - 02:20

జైపూర్, ఆగస్టు 11: భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పండితుడేమీ కాదని, ఆయన గొడ్డు మాంసం, పంది మాంసం తిన్నారని రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహూజా వ్యాఖ్యానించారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్న ఈ ఎమ్మెల్యే రాజస్తాన్ రాష్ట్రం, అల్వార్ జిల్లా, రామ్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

08/12/2018 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 11: రాజ్యసభ ఎన్నికలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా దాఖలు చేసిన పిటిషన్‌లో ఆస్తులు, అప్పులపై తప్పుడు వివరాలను పొందుపరిచారని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాగా ఈ ఆరోపణల్లో నిజం లేదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తోసిపుచ్చారు.

Pages