S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/12/2018 - 02:14

పుదుచ్ఛేరి, ఆగస్టు 11: అధికార రహస్యాలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణ సామి విరుచుకుపడ్డారు. ఒక విధంగా అత్యున్నత గవర్నర్ పదవి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆమె వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈమేరకు బేటీకి ఓ బహిరంగ లేఖ రాసిన ముఖ్యంత్రి లేఖ ప్రతులను శనివారం మీడియాకు విడుదల చేశారు.

08/12/2018 - 02:13

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ మహాత్మాగాంధీ పేరుతో ప్రత్యేక పీఠం ఏర్పాటుకాలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. యూజీసీ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఏ వర్శిటీ ముందుకురాలేదని ఓ ప్రకటనలో తెలిపారు. మేధావులు, ప్రముఖ వ్యక్తులు, ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడిన మహోన్నతుల పేరుతో పీఠాలు ఏర్పాటుకు యూజీసీ ఓ విధానం రూపొందించింది.

08/12/2018 - 02:11

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ దళితులపై మెసలికన్నీరు కారుస్తున్నాయని, వాస్తంగా దళితుల కోసం వారు చేసిందేమీ లేదని ఎల్‌జీపీనేత, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ధ్వజమెత్తారు. ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ బిల్లు(సవరణ)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

08/12/2018 - 02:10

న్యూఢిల్లీ,ఆగస్టు 11: దేశం వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఏదుర్కొంటున్న సమస్యల పరిష్కరం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గేకు సర్పంచుల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. వేదిక నాయకులు అందోల్ క్రిష్ణ, బాపునర్సింలు తదితరులు శనివారం ఖార్గేను కలిశారు.

08/12/2018 - 02:10

న్యూఢిల్లీ,ఆగస్టు 11: గిరిజనుల కోసం ప్రత్యేకంగా అరకులో రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్‌ను విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్‌కు కొత్తపల్లి గీత లేఖ రాశారు.

08/12/2018 - 02:09

న్యూఢిల్లీ,ఆగస్టు 11: దేశంలో ప్రాంతాలు, సంస్కృతులు వెరైన మనమంతా భారతీయులుగా జీవీస్తున్నామని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. ఉపరాష్టప్రతి నివాసంలో ఢిల్లీ స్టడి గ్రూప్ నేతృత్వంలో ‘తీజ్’ ఉత్సవ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి విజయ్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రదర్శించిన పలు సంప్రదాయ నృత్యాలు అందరిని అకట్టుకొన్నాయి.

08/12/2018 - 02:09

హైదరాబాద్, ఆగస్టు 11: ఆరు నెలల శిక్షణతో అనేక మంది నిరుద్యోగులు బ్యాంకుల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని ఆ సంస్థ అధిపతి డాక్టర్ నాగేంద్ర చౌదరి పేర్కొన్నారు. టైమ్స్‌ప్రో శిక్షణతో ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు శనివారం నాడు జరిగిన సత్కార కార్యక్రమానికి ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షులు కరుణా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలైన అభ్యర్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.

08/12/2018 - 02:08

చండీగఢ్, ఆగస్టు 11: ఈ నెల 18న పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ రాష్ట్ర మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్దును ఆహ్వానించారు. ఈ విషయమై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపినట్లు సమాచారం.

08/12/2018 - 02:04

చిత్రాలు..72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బెంగళూరు పరేడ్ మైదానంలో మోటార్ సైకిల్ ప్రదర్శన రిహార్సల్ చేస్తున్న ఆర్మీ బృందం

*అమృత్‌సర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం రిహార్సల్ చేస్తున్న విద్యార్థులు

08/12/2018 - 02:00

ముంబయి, ఆగస్టు 11: శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాస్త్రాల్లో వినూత్నమైన ఆవిష్కరణలకు మార్గదర్శిగా నిలిచి దేశాభివృద్ధికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మార్పు లేని సమాజాల్లో అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. నవ భారత నిర్మాణంలో ఐఐటీల పాత్ర మరువరానిదని ఆయన అన్నారు.

Pages