S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/11/2018 - 12:50

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం జలదిగ్బంధనంలోనే ఉన్నది. ఎడతెరపి లేకుండా కరుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళలో కనుచూపు మేరలో వరద నీరు కనిపిస్తోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 29మంది చనిపోయారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 54,000 మంది ఇళ్లను కోల్పోయారు. రహదారులు కొట్టుకుపోయాయి. ఆనకట్టల గేట్లు తెరచి వరద నీటిని కిందికి వదలివేస్తున్నారు.

08/11/2018 - 04:31

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఇథనాల్ వాడకాన్ని పెంచడం ద్వారా ముడి చమురు దిగుమతులను భారీగా తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

08/11/2018 - 02:06

రాజస్థాన్, ఆగస్టు 10: పెళ్లిళ్లు కావడం లేదని ఓ ఊరు పేరే మార్చేసిన వింతైన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది! రాజస్థాన్‌లోని మియాక గ్రామంలో యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో గ్రామస్థులంతా ఏకమయ్యారు. ఊర్లో రహదారులు, ఆస్పత్రులు, రవాణా సౌకర్యం ఇలా అన్ని ఉన్నా యువకులకు పెళ్లి కావడం లేదని, ఇందుకు ప్రధాన కారణం తమ ఊరి పేరేనని తేల్చేశారు.

08/11/2018 - 01:55

తిరువనంతపురం, ఆగస్టు 10: భారీవర్షాలు, వరదలతో కేరళలో ప్రజాజీవనం స్తంభించింది. వరదలు, భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఇంతవరకు 26మంది మరణించారు. ఇందులో 11 మంది కొండ చరియలు విరిగిపడి మృతి చెందినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఇదుక్కి రిజర్వాయర్ పొంగి ప్రవహించడంత గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులను అనుమతించడంలేదు.

08/11/2018 - 01:54

న్యూఢిల్లీ, ఆగస్టు 10:వరదలు, వర్షాలతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. వరదలతో నీటమునిగిన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. తాను, కేరళ సీఎం పినరయి విజయ్ కుమార్ కలిసి ఏరియల్ సర్వే నిర్వహిస్తామన్నారు.

08/11/2018 - 01:52

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్,తెలంగాణల మధ్య నెలకోన్న సమస్యలను పరిష్కరించేందుకుగాను కేంద్రానికి తగిన విధంగా సిఫార్సు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విభజన హామీలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘానికి విజ్ఞప్తి చేసింది. విభజన చట్టంలో అమలు కావాల్సిన 14 ప్రధాన అంశాలతో కూడిన పవర్ పాయిట్ ప్రజంటేషన్ ద్వారా తెలంగాణ స్థారుూ సంఘానికి వివరించింది.

08/11/2018 - 01:34

న్యూఢిల్లీ, ఆగస్టు 10: సర్పంచ్‌లు లేకుండా గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఈనెల 15 తేదీ నుంచి పల్లెశోభ కార్యక్రమాన్ని చేపట్టిందని, సర్పంచ్‌లు లేకుండా అది సాధ్యమా?అని అన్నారు.

08/11/2018 - 01:33

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలో బాల్యవివాహాల నిషేధ చట్టం కింద కొత్త నిబంధనలపై చట్టాలను ఉత్తరప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలు రూపొందించాల్సి ఉందని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి మేనకా గాంధీ లోక్‌సభకు చెప్పారు. బాల్యవివాహాలను నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించిన ట్లు చెప్పారు.

08/11/2018 - 01:09

బళ్ళారి, ఆగస్టు 10: తుంగభద్ర రిజర్వాయర్‌కు వరద మరింత పెరగడంతో 20 గేట్ల గుండా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి వరద వేగంగా పెరుగుతోంది. దీంతో శుక్రవారం జలాశయం 20 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువ నదిలోకి 40,909 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 10 క్రస్ట్‌గేట్లు 1 అడుగు మేర, మరో 10 క్రస్ట్‌గేట్లు 2 అడుగుల మేర ఎత్తారు.

08/11/2018 - 01:07

న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం లోక్‌సభలో పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఎంపీలు పోడియం వద్దకు వచ్చి రాఫెల్ డీల్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. తక్షణం దర్యాప్తునకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు.

Pages