S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/21/2018 - 12:18

న్యూఢిల్లీ:అవిశ్వాసంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ సమాధానాలు దాటవేస్తూ ఎదురుదాడి చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ ప్రసంగంపై స్పందించమని విలేకరులుగా కోరగా.. మోదీ ప్రసంగంలో పస లేదని విమర్శించారు. మరోసారి తన వాక్ చాతుర్యాన్ని చాటుకున్నారని సోనియా అన్నారు.

07/21/2018 - 02:45

న్యూఢిల్లీ, జూలై 20: రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్‌విమానాల కొనుగోలు ఒప్పందంలో రహస్య క్లాజు లేదన్న ఎఐసిసి అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తోసిపుచ్చారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు సంబంధించిన ప్రాథమిక ఒప్పందం యుపీఏ హయాంలో జరిగిందన్నారు.

07/21/2018 - 04:49

* ఏపీకి అన్యాయం రాజకీయ కుట్రలో భాగమే * అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ తీవ్ర ఆరోపణలు
* ఆరోపణల్లో కొన్ని రికార్డుల నుండి తొలగింపు

07/21/2018 - 02:37

న్యూఢిల్లీ, జూలై 20: రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్, భారత్‌ల మధ్య జరిగిన ఒప్పందం భద్రతకు సంబంధించినదని, చట్టపరంగా ఇరుదేశాలు నిర్దేశించిన సమాచారంపై తప్పనిసరిగా గోప్యతను పాటించాల్సి ఉంటుందని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 2008 నాటి ఒప్పందంపై ఇరు దేశాలు న్యాయపరంగా కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

07/21/2018 - 23:00

రాహుల్ కౌగిలింతపై కాంగ్రెస్ వ్యాఖ్య

07/21/2018 - 04:51

* ఏపీ ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పిందేమిటి? * లోక్‌సభలో నిప్పులు చెరిగిన గల్లా జయదేవ్
సభలో టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం

07/21/2018 - 04:52

న్యూఢిల్లీ, జూలై 20: టీడీపీ ప్రత్యేక హోదా కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిందని బీజేపీ లోక్‌సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో తెలుగుదేశం చేతులు కలపడం సిగ్గుచేటని శుక్రవారం లోక్‌సభలో నిప్పులు చెరిగారు.

07/21/2018 - 01:52

న్యూఢిల్లీ, జూలై 20: బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలను పునఃసమీక్షించడానికి ఉన్నత స్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌పై తీర్పు ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అయితే, ఎప్పటికి వాయిదా పడిందనే విషయాన్ని చెప్పలేదు. అయితే, ఈనెల 24లోగా లిఖితపూర్వక వాదనలు అందించాల్సిందిగా సూచించింది. బాబ్రీ మసీదు కేసును విచారించిన సుప్రీం కోర్టు 1994లో పలు వ్యాఖ్యలు చేసింది.

07/21/2018 - 04:56

న్యూఢిల్లీ,జూలై 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం భారీ మెజారిటీతో వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. నరేంద్ర మోదీ మంత్రివర్గంపై వచ్చిన అవిశ్వాస తీర్మానం 199 ఓట్ల తేడాతో వీగిపోయింది. తెరాస, శివసేన పార్టీలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

07/21/2018 - 01:49

న్యూఢిల్లీ,జూలై 20: తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన తప్పులను కప్పిపుచ్చుకోవటంతోపాటు రాజకీయ ప్రయోజనాల సాధన కోసం ఎన్టీయే నుండి తప్పుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేయవలసినదంతా చేస్తుందని హామీ ఇచ్చారు.

Pages