S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/19/2018 - 17:20

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు మోదీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శివసేన వ్యతిరేకంగా ఓటు వేస్తుందని కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ అన్నారు. ఆయన లోకసభలో తమ ప్రభుత్వానికి తగిన మద్దతు ఉందని,అవిశ్వాసంపై తమకు ఎలాంటి భయం లేదని అన్నారు.

07/19/2018 - 17:12

న్యూఢిల్లీ: రేపు లోకసభలో జరుగనున్న అవిశ్వాస తీర్మానానికి దూరంగా వుండాలని అన్నాడీఎంకే, బిజు జనతాదళ్ నిర్ణయించాయి. లోకసభలో అన్నాడీఎంకేకు 37, బిజు జనతాదళ్‌కు 20 మంది సభ్యులు ఉన్నారు. ఈ అవిశ్వాసంపై తామే విజయం సాధిస్తామని అధికార, ప్రతిపక్షాలు ధీమాగా ఉన్నాయి.

07/19/2018 - 17:11

విశాఖపట్నం: అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లే అవకాశం లేదని పేర్కొంది.

07/19/2018 - 13:50

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మూకస్వామ్యదాడులకు పాల్పడటంపై ఈ రోజు ఉభయ సభల్లో చర్చ జరిగింది. మూక‌స్వామ్య‌, మూకోన్మాద దాడుల‌ను లోక్‌స‌భ‌లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. ఘ‌ట‌న‌లు జ‌రిగిన రాష్ట్రాల సీఎంల‌తో తాను స్వ‌యంగా మాట్లాడాన‌ని, ఉన్మాదుల‌ను అరెస్టు చేయాల‌ని సూచించిన‌ట్లు చెప్పారు

07/19/2018 - 13:27

న్యూఢిల్లీ మహాత్మాగాంధీ జయంత్యుత్సవాల సందర్భంగా వృద్ధ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంచిందిః 55ఏళ్లు దాటిన మహిళా ఖైదీలకు, అరవై ఏళ్లు దాటిన ఖైదీలకు ఇది వర్తిస్తుంది. వరకట్న హత్యలు, అత్యాచారం, మానవ అక్రమ రవాణా సహా పీఓటీఏ, యూఏపీఏ, టాడా, మనీ లాండరింగ్‌, ఫెమా, ఏన్డీపీఏ, అవినీతి నిరోధక చట్టాల కింద శిక్ష అనుభవిస్తున్న వారికి మాత్రం ఈ క్షమాభిక్ష వర్తించదు.

07/19/2018 - 12:59

జైపూర్: ఇద్దరు కన్నా ముగ్గురు పిల్లలు కలిగితే పదవీ విరమణ తప్పనిసరి చేసిన రాజస్థాన్ ప్రభుత్వం ఆ నిబంధనకు సడలింపు ఇచ్చింది. పదవీ విరమణ తప్పనిసరి చేసే క్లాజ్‌ను తొలిగించింది. ఈ మేరకు గురువారంనాడు జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు.

07/19/2018 - 12:56

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానానికి అమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఈరోజు ఉదయం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిందిగా టీడీపీ ఎంపీలు కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ సందర్భంగా అండగా ఉంటామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు.

07/19/2018 - 12:55

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో వైకాపా ఎంపీలు రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని కోరుతూ వైకాపా ఎంపీలు ప్లకార్డులు చేతబూని ఆందోళన చేశారు.

07/19/2018 - 12:52

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు గురువారంనాడు సజావుగా ప్రారంభమయ్యాయి. లోకసభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యసభలోనూ ఎలాంటి ఆందోళన లేకుండా సభ సజావుగా సాగుతుంది. మరోవైపు ఇతర పార్టీల మద్దతును కూడగట్టే పనిలో సభ్యులు ఉన్నారు.

07/19/2018 - 12:51

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఎన్డీఆర్‌ఎఫ్ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భవనాలు కూలిన సమయంలో 12మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిసింది. శిథిలాలు తొలిగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ వెల్లడించారు.

Pages