S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/06/2018 - 17:52

ముంబయి: ముంబయి జుహు బీచ్‌లో గల్లంతయిన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అంధేరిలోని డిఎన్ నగరం ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు నిన్న జుహు బీచ్‌కు వెళ్లారు. వీరిలో ఐదుగురు యువకులు సముద్రంలోకి దిగారు. నలుగురు గల్లంతయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతయినవారి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.

07/06/2018 - 13:52

కోల్‌కత: అధికారులు, ప్రజాప్రతినిధులు ఖర్చులు తగ్గించుకోవాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆదేశాలు జారీచేశారు. ఆమె తన మెనూలో ప్రతిరోజూ ఉండే మటన్, రొయ్యల కూరలను కూడా తీసేసుకున్నారు. అంతేకాదు అధికారులు ఈవెంట్లు,్ఫంక్షన్లు తగ్గించుకోవాలని కోరారు.

07/06/2018 - 13:00

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. గత రాత్రి పోషియాన్ జిల్లా నుంచి అపహరించుకుపోయిన జావేద్ అహ్మద్ అనే కానిస్టేబుల్‌ను ముష్కరాలు కాల్చి దారుణంగా హత్యచేశారు. కుల్గాం జిల్లాలోని సెహ్‌పొరా ప్రాంతంలో రోడ్డుపక్కన ఆయన మృతదేహం లభించినట్లు పోలీసులు వెల్లడించారు.

07/06/2018 - 12:58

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కే విశేషాధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ..న్యాయమూర్తులకు కేసులను కేటాయించే అధికారం కూడా సిజీఐకే ఉంటుందని స్పష్టం చేసింది. తన ప్రత్యేక అధికారాలను ఇతర న్యాయమూర్తులతో పంచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

07/06/2018 - 12:57

న్యూఢిల్లీ: ఎపుడూ సంచలన ఆరోపణలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారని కావాలంటే డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని ఓ ఛానల్‌లో మాట్లాడుతూ అన్నారు. అలాగే కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా పంజాబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహిస్తున్న డ్రగ్ పరీక్షలపై స్పందించారు.

07/06/2018 - 12:54

జమ్మూకాశ్మీర్: అమరనాథ్ యాత్రలో మరో అపశృతి చోటుచేసుకుంది. బండరాళ్లు పడటంతో శేరిలింగంపల్లికి చెందిన ఓ యాత్రికురాలు మృతిచెందింది.

07/06/2018 - 12:53

జమ్మూకాశ్మీర్: వాతావరణం అనుకూలించకపోవటంతో అమరనాథ్ యాత్ర మళ్లీ నిలిపివేశారు. భాగవతినగర్ బ్యాస్ క్యాంప్ నుంచి వయా పెహల్‌గాం, బల్తాల్ మార్గాల గుండా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. అలాగే ఉధంపూర్ వద్ద నిలిచిపోయిన 1,798 మంది యాత్రికులను పెహల్‌గాం వరకు వెళ్లడానికి అనుమతించారు.

07/06/2018 - 05:19

న్యూఢిల్లీ, జూలై 5: వచ్చే ఏడాది 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి వణుకు పుట్టిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న దేశవ్యాప్త పర్యటన ముగింపు దశకు చేరుకుంది. అమిత్ షా పర్యటించిన 395 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ పరిస్థితి బీజేపీకి అంతగా అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

07/06/2018 - 05:28

బెంగళూరు, జూలై 5: కర్నాటకలో రూ. 34వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ప్రకటించారు. అదే సమయంలో విద్యుత్, ఇంధనం చార్జీలను భారీగా పెంచారు. గురువారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, రైతుల రుణాలను మాఫీ చేయాలన్న సంకల్పాన్ని అమలు చేశామన్నారు. రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

07/06/2018 - 05:23

అమేథీ, జూలై 5: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీకి ప్రాధాన్యత ఇస్తామని, దేశవ్యాప్తంగా వస్తు సేవా పన్ను కింద ఒకే పన్ను విధానాన్ని అమలు చేస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్‌టీ విధానం కింద ఒకే పన్ను విధించే కొత్త పద్ధతిని అమలు చేస్తాం. జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలు, డీజిల్‌ను తెస్తాం.

Pages