S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/03/2018 - 13:51

ముంబయి: ముంబయి మహానగరాన్ని ఎడతెరపిలేని వర్షాలు ముంచెత్తుతున్నాయి. అంధేరీ రైల్వే స్టేషన్‌లో పాదచారుల వంతెన కూలటంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. థానేలోని ఓ హౌసింగ్ సొసైటీ ప్రహారీ గోడ కూలడంతో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు.

07/03/2018 - 13:50

న్యూఢిల్లీ: మానస సరోవర యాత్రకు వెళ్లిన యాత్రీకులలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు మృతిచెందినట్లు ఏపీ భవన్ అధికారులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్‌కు తరలించారు. ఈమేరకు నేపాల్ రాయబారి కార్యాలయంతో ఏపీ భవన్ కమిషనర్ శ్రీకాంత్ సంప్రదింపులు జరుపుతున్నారు.

07/03/2018 - 12:53

న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రకు సంబంధించి యాత్రీకులు పడుతున్న ఇబ్బందులపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ టిట్టర్ ద్వారా స్పందించారు. ఈ మేరకు హెలికాఫ్టర్లను పంపమని నేపాల్ ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. యాత్రీకులకు ఆహారం, మందులు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. వయోవృద్ధులైన యాత్రీకులకు సిమ్‌కోటలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

07/03/2018 - 12:52

కైలాస్: మానససరోవర్ యాత్రలో భక్తులు చిక్కుకున్నారు. నేపాల్‌లోని సిమీకోట్ ప్రాంతంలో భారీవర్షాలు కురుస్తుండటం వల్ల భక్తులు చిక్కుకుపోయారు. ఈ మేరకు హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేశారు. భక్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మానస సరోవరంలో చిక్కుకున్న తెలుగు భక్తులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ తెలిపారు.

07/03/2018 - 12:50

ముంబయి: భాటియాల ఇంట్లో దొరికిన రెండు రిజిస్టర్లలోని రాతలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. వీటిని ఫోరెనిక్స్ పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడించారు. ఇందులో వీరి మరణానికి సంబంధించిన 11 సూచనలు ఉన్నాయని, ఇవి వారి మూఢ విశ్వాసాలను, తాంత్రిక కారణాలను వెల్లడిస్తున్నాయని పోలీసులు తెలిపారు. మరణానికి ముందు ఏవిధంగా ప్రవర్తించాలో ఆ సూచనల్లో పొందుపరచబడ్డాయని వెల్లడించారు.

07/03/2018 - 12:49

ముంబయి: భారీ వర్షాల కారణంగా ముంబయిలోని అంధేరి రైల్వేస్టేషన్‌లోని ప్రయాణీకులు నడిచే రైల్వేవంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఇంజనీరింగ్ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. వంతెన కూలటంతో రైళ్ల రాకపోకలకు ఆలస్యం అవుతుంది. పశ్చిమ రైల్వేకు సంబంధించిన రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.

07/03/2018 - 05:18

లక్నో, జూలై 2: దేశ రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసే ఉత్తర్‌ప్రదేశ్‌పై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దృష్టి సారిస్తున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభకు జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటినుంచే అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకోవాలని యోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా యూపీలో పర్యటించనున్నారు.

07/03/2018 - 05:17

న్యూఢిల్లీ, జూలై 2: భిన్న సంస్కృతులకు వ్యతిరేకంగానే అఫ్గానిస్తాన్‌లో దాడి జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన, మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. అఫ్గాన్ జలాలాబాద్‌లో ఆదివారం జరిగిన మానవ బాంబు దాడిలో 20మంది సిక్కు జాతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే.

07/03/2018 - 05:14

బెంగళూరు, జూలై 2: కర్నాటకలో కర్షకుల కష్టాలకు ముగింపు లభించిందని, అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం వారి సంక్షేమానికి పూర్తినిబద్ధతతో పనిచేస్తుందని వారికి ఇక అన్నీ మంచిరోజులేనని కర్నాటక గవర్నర్ వాజుభాయి వాలా ప్రకటించారు. తమ ప్రభుత్వం మానవతా దృష్టితో పలు చర్యలు తీసుకుని ఇబ్బందుల్లో ఉన్న రైతులను గట్టెక్కిస్తుందని ఆయన చెప్పారు.

07/03/2018 - 05:13

న్యూఢిల్లీ, జూలై 2: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ శ్రీకారం చుట్టారు. సోమవారం రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడును కలిసి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించారు. ఏకగ్రీవ పద్ధతిలో ఎన్నుకునేందుకు తాను ప్రతిపక్షంతో జరుపుతున్న చర్చల గురించి ఆయన వెంకయ్యనాయుడుకు వివరించారు.

Pages