S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/14/2018 - 04:46

న్యూఢిల్లీ, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్ధాలకోరు, వెన్నుపోటుకు పెట్టింది పేరంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోశారు.

06/14/2018 - 03:11

న్యూఢిల్లీ, జూన్ 13: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం గత 48 గంటల్లో చాలావరకు మెరుగుపడిందని ఏఐఐఎంఎస్ డాక్టర్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈనెల 11న వాజ్‌పేయి (93) ఏఐఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయన ఉదరం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని ఏఐఐఎంఎస్ డైరెక్టర్ నణదీప్ గులెరియా తెలిపారు.

06/14/2018 - 04:49

* సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో స్పష్టీకరణ

06/14/2018 - 05:01

న్యూఢిల్లీ, జూన్ 13: ఉన్నత వ్యవసాయ విద్యాభివృద్ధికి, నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేయడానికి వీలుగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) రూ.2,225.46 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 2020 నాటికల్లా ఈ నిధులను పూర్తిగా వినియోగించాలని నిర్దేశించింది.

06/14/2018 - 04:51

ముంబయి, జూన్ 13: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా ‘మహా ఘట్‌బంధన్’ (మహాకూటమి) ఏర్పాటుకావాలన్నది ప్రజల అభిమతమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్టల్రో రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహాకూటమి ఏర్పాటు కేవలం రాజకీయ పార్టీలకే పరిమితమైన అభిప్రాయం కాదన్నారు.

06/13/2018 - 16:17

ముంబయి: ధనవంతుల ప్రయోజనాలే తప్ప సాధారణ ప్రజల గోడు మోదీకి ఏమాత్రం పట్టడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపంచారు. 'రాజకీయాల కోసం కాకుండా ఇవాళ మహాఘట్‌బంధన్ ప్రజల సెంటిమెంట్‌గా మారిందని, రాజ్యాంగంపైన, వ్యవస్థలపైన మోదీ దాడి చేయడం ఏమాత్రం సరికాదు' అని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఇంధనం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని విమర్శించారు.

06/13/2018 - 16:11

ముంబయి: వర్లిలోని ఓ బహుళ అంతస్తు భవనంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనంలోని 33వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పివేసేందుకు యత్నిస్తున్నారు. ఈ రెండు అంతస్తుల్లో ఉన్న 90 మందిని బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అయితే ఇదే బహుళ అంతస్తు భవనంలో బాలీవుడ్ నటి దీపికా పదుకునే నివసిస్తుంది.

06/13/2018 - 13:25

న్యూఢిల్లీ: హమ్‌ఫిట్‌తో ఇండియాఫిట్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన సవాల్ కు స్పందించిన ప్రధాని మోదీ తాజాగా యోగాతో పాటు పలు శారీరక వ్యాయమాలు చేసిన 2 నిమిషాల నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జనతాదళ్(సెక్యులర్) నేత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి సవాల్ విసిరారు.

06/13/2018 - 13:20

న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా చేస్తోన్న ఆందోళనను విరమించి విధులకు హాజరయ్యేలా ఐఏఎస్‌ అధికారులకు సూచించడంతో పాటు మరో మూడు డిమాండ్లపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ కార్యాలయంలో ఆప్‌ మంత్రుల ధర్నా నిన్నటి నుంచీ కొనసాగుతోంది. తమ డిమాండ్లపై లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నుంచి స్పందన లేనందువల్లే మరో ప్రత్యామ్నాయం లేక ధర్నాకు దిగినట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

06/13/2018 - 12:28

బెంగళూరు : కర్ణాటకలోని జయనగర్ నియోజకవర్గంలో 4 వేల ఓట్ల ఆధిక్యంతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్య రెడ్డి 54,045 ఓట్లతో ఘన విజయం సాధించారు. బీజేపీకి అభ్యర్థికి 50,270 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Pages