S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/13/2018 - 12:24

మెయిన్‌పురి‌: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున మెయిన్‌పురి సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 17 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 35మందికి పైగా గాయపడ్డారు. వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.

06/13/2018 - 12:12

జమ్మూకాశ్మీర్: మళ్లీ రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్‌లోని సైనిక చెక్‌పోస్టులపై పాకిస్థాన్ సైన్యం మోటార్లతో దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌ సైన్యం కాల్పులను బీఎస్‌ఎఫ్ దళాలు తప్పికొట్టాయి. ఈ క్రమంలో ఎనిమిది గంటల పాటు భీకర ఎదురుకాల్పులు జరిగాయి.

06/13/2018 - 05:03

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత బుధవారంనాడు మొదటిసారిగా ఇస్తున్న ఇఫ్తార్ విందులో ప్రతిపక్షం బలాన్ని ప్రదర్శించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను చిత్తు చేయాలనుకుంటున్న ప్రతిపక్ష పార్టీలన్నీ రాహుల్ ఇచ్చే ఇఫ్తార్ విందు సమావేశానికి హాజరవుతున్నట్లు తెలిసింది.

06/13/2018 - 02:13

ఇండోర్, జూన్ 12: మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహరాజ్ మంగళవారం తన స్వగృహంలో అనుమానస్పద పరిస్థితుల్లో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర భారతంలో సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల క్రితం మంత్రి హోదాను ఆఫర్ చేయగా, భయ్యూజీ తిరస్కరించారు.

06/13/2018 - 02:08

న్యూఢిల్లీ, జూన్ 12: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికార్లు మంగళవారం ఆరుగంటల పాటు ప్రశ్నించారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ ఎదుట హాజరు కావడం ఇది రెండోసారి. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన చిదంబరం సాయంత్రం 5 గంటలకు తిరిగి వెళ్లిపోయినట్లు అధికార్లు తెలిపారు.

06/13/2018 - 02:07

న్యూఢిల్లీ, జూన్ 12: 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే పద్మ అవార్డుల కోసం ఇంతవరకు 1,654 మంది దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర హోంశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పద్మ అవార్డుల కోసం ఈ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పద్మ అవార్డుల కోసం ఇంతవరకు 1,654 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా ఇందులో 1,207 దరఖాస్తుల పరిశీలన పూర్తి అయ్యిందని హోంశాఖ వెల్లడించింది.

06/13/2018 - 02:06

న్యూఢిల్లీ, జూన్ 12: శ్యామ్ సుందర్ ఓ చిరుద్యోగి. అయితేనేం రైల్వేశాఖలో అతడి పేరు మారుమోగుతోంది. విషయం ఏమిటంటే.. రైల్వే మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలతో ఓ బుక్‌లెట్ వేయాలని నిర్ణయించింది. కవర్‌పేజీ బొమ్మకోసం అనే్వషణ ప్రారంభించింది. దీనికోసం రైల్వేశాఖ చిత్రలేఖన పోటీలు నిర్వహించగా శ్యామ్ సుందర్ వేసిన చిత్రం ఎంపికైంది. ఇప్పుడా చిత్రమే రైల్వే మంత్రిత్వ శాఖ బుక్‌లెట్ కవర్ పేజీపై ముద్రించనున్నారు.

06/13/2018 - 02:03

న్యూఢిల్లీ, జూన్ 12: 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీసీలకు 40 శాతం సీట్లివ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరినట్టు రాష్ట్ర కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలంగాణలో సీట్లు, నాయకత్వం అగ్ర కులాలకు దక్కడంతోనే బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని పేర్కొన్నారు.

06/13/2018 - 02:03

న్యూఢిల్లీ, జూన్ 12: సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయాన్ని స్వచ్ఛ ఐకానిక్‌గా కేంద్రం గుర్తించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ‘స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనీషియేటివ్’ మూడో దశలో దేశవ్యాప్తంగా 10 ప్రదేశాలను కేంద్రం ప్రకటించింది.

06/13/2018 - 01:17

న్యూఢిల్లీ, జూన్ 12: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య సింగపూర్‌లో జరిగిన చారిత్రక సమావేశాన్ని భారత్ స్వాగతించింది. మన పొరుగు దేశానికి (పాకిస్తాన్) ఉత్తరకొరియా నుంచే అణు పరిజ్ఞానం లభిస్తోంది. ఈ లింకేజీపై తన అందోళనకు ఉత్తరకొరియా‘ ద్వీపకల్ప సమస్యపై’ వెలువడే తీర్మానంలో స్థానం లభిస్తుందన్న ఆశాభావాన్ని భారత్ వ్యక్తం చేసింది.

Pages