S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/13/2018 - 02:17

న్యూఢిల్లీ, జూన్ 12: విచిత్రమైన నిర్ణయాలతో అందరినీ ఆశ్చరపరిచే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ముందు తన మంత్రులతో కలిసి ధర్నా చేశారు. సమ్మె చేస్తున్న ఐఎఎస్ అధికారులు ఆందోళన విరమించే దిశగా లెఫ్టినెంట్ గవర్నర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని కేజ్రీవాల్ పత్రికలకు పంపారు.

06/13/2018 - 02:10

న్యూఢిల్లీ, జూన్ 12: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని ఏబీ వాజపేయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్య, ఇన్‌ఫెక్షన్లతో సోమవారం వాజపేయి ఎయిమ్స్‌లో చేరారు. 93 ఏళ్ల బీజేపీ అగ్రనేత వాజపేయి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం ఎయిమ్స్ బులెటిన్ విడుదల చేసింది. ‘వాజపేయి ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్య సేవలకు ఆయన స్పందిస్తున్నారు. అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి.

06/13/2018 - 04:25

ధానే (మహారాష్ట్ర), జూన్ 12: మహాత్మాగాంధీ హత్య వెనక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) హస్తం ఉందని ఆరోపణ చేసిన కేసులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై భివాండీ కోర్టు మంగళవారం అభియోగాలను నమోదు చేసింది. ఈ కేసులో తాను దోషిని కానని రాహుల్ గాంధీ కోర్టుకు విన్నవించారు. ఆరెస్సెస్‌పై ఆరోపణలు చేశానంటూ రాజేష్ కుంతే అనే వ్యక్తి భివాండి కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు.

06/12/2018 - 17:58

ఇండోర్ : వివాదాస్పద స్పిరిచ్యువల్‌ గురూ భయ్యూజీ మహారాజ్‌ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్రమంలో తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న స్వామిజీని హుటాహుటిన ఇండోర్‌ బాంబే ఆసుపత్రికి తరలించారు. భయ్యూజీని పరీక్షించిన వైద్యులు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు.

06/12/2018 - 16:06

హైదరాబాద్‌: అంబుడ్స్ మెన్ వివేక్‌పై తీసుకున్న నిర్ణయం సరైందేనని హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందని మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు వివేక్ పదవి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, వివేక్ ప్యానల్ ఎంపికలో అవకతవకలు జరిగాయని తాను మొదట్నుంచీ చెబుతున్నానన్నారు.

06/12/2018 - 13:24

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆప్‌ మంత్రులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో బైఠాయించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సహా ఇద్దరు మంత్రులు ఎల్‌జీ కార్యాలయంలో రాత్రి నుంచి బైఠాయించారు.

06/12/2018 - 13:15

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు వాజ్‌పేయి స్పందిస్తున్నారని.. యాంటీబయోటిక్స్ కొనసాగిస్తున్నామని తెలిపింది. వాజ్‌పేయికి ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అయ్యే వరకు ఆస్పత్రిలో ఉంటారని ఎయిమ్స్ చెప్పింది.

06/12/2018 - 12:35

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌ పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీస్‌ గార్డ్‌ పోస్ట్‌పై సాయుధ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురు ఉగ్రవాదుల బృందం పోలీస్‌ పోస్ట్‌పై కాల్పులకు తెగబడటంతో ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ఘటనా స్థలంలోనే మరణించారు.

06/12/2018 - 12:30

భీవాండి : పరువునష్టం కేసులో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భీవాండి కోర్టు ముందు హాజరయ్యారు. మహాత్మాగాంధీని చంపింది ఆర్‌ఎస్‌ఎస్ అని రాహుల్ గతంలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన రాజేశ్ కుంటే పరువునష్టం కేసును దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి విముక్తి కల్పించాలని అప్పుడు రాహుల్ తరపున న్యాయవాది కోర్టును కోరారు.

06/12/2018 - 04:22

లక్నో: బీజేపీని మట్టిగరిపించే విషయంలో సమాజ్‌వాదీ పార్టీ చిత్తశుద్ధితో ఉందని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇందుకు అవసరమైతే కొన్ని సీట్లు వదులుకుని అయినా బీఎస్పీతో కలిసి నడిచేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ‘కొన్ని అసెంబ్లీ స్థానాలు బీఎస్పీ కోసం త్యాగం చేయాల్సి వస్తే అందుకు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధపడే ఉంటుంది. ఎందుకంటే, మా ఇద్దరి లక్ష్యం బీజేపీని ఓడించడమే కనుక’ అన్నారు.

Pages