S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/12/2018 - 02:00

పాట్నా, జూన్ 11: బిహార్‌లో మద్య నిషేధం కొనసాగుతుందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పథకాన్ని మరింత పక్కాగా అమలుచేయడానికి మద్యపాన నిషేధం చట్టంలో మరిన్ని సవరణలు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో అన్ని మత్తుపదార్థాలనూ నిషేధించే ఆలోచన ఉందని ఆయన చెప్పారు.

06/12/2018 - 01:37

న్యూఢిల్లీ, జూన్ 11: గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు అభివృద్ధికి నిజమైన ఏజెంట్లు అని కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన దీనదయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లిలీహుడ్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 34 ఉత్తమ ఎస్‌హెచ్‌జీలకు జాతీయ అవార్డులను అందజేశారు.

06/12/2018 - 01:37

పాట్నా, జూన్ 11: ‘కుటుంబంలో కలతలు లేవు. పార్టీలో కుమ్ములాటలూ లేవు. అంతా సంతోషంతో కూడిన వాతావరణమే అలముకుని ఉంది’ అని బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, ఆమె కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు స్పష్టం చేశారు. ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ 71వ జన్మదినం సందర్భంగా ఒకే గూటికి చేరిన లాలూ కుటుంబం ఆనందోత్సాహాలతో గడిపారు.

06/12/2018 - 01:35

గువహటీ, జూన్ 11: అస్సాంలో సోమవారం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు. షిల్లాంగ్‌లోని ప్రాంతీయ భూకంప కేంద్రం సమాచారం ప్రకారం నాగావ్ జిల్లా ధింగ్‌ను కేంద్రీకృతం చేసుకుని ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం స్వల్పమేనన్నారు.

06/12/2018 - 01:34

న్యూఢిల్లీ, జూన్ 11: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని తెలుగుదేశం ఎస్సీ, ఎస్టీ నాయకుల బృందం సోమవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నాయకులు రాష్టప్రతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు.

06/12/2018 - 04:25

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం చేసిన ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని కోరడం ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థ ‘ప్రాథమిక తప్పిదానికి’ పాల్పడటం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో నియామకాలను ప్రభుత్వం నిలిపేస్తున్నదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మంత్రి పై వ్యాఖ్యలు చేశారు.

06/12/2018 - 01:32

న్యూఢిల్లీ, జూన్ 11: ప్రధాని నరేంద్ర మోదీని, రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేస్తామంటూ పేర్కొన్న లేఖ ప్రామాణికత ఎంత అంటూ సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఈ లేఖలోని నిజానిజాలను పూర్తి సాక్ష్యాధారాలతో ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన కోరారు. ప్రధానికి పూర్తి భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని ఆయన పేర్కొన్నారు.

06/12/2018 - 01:31

న్యూఢిల్లీ, జూన్ 11: ఓబీసీల ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని పెంపొందించే రీతిలో దేశంలో ఒక ఆదర్శప్రాయ, స్ఫూర్తిదాయకమైన నాయకుడు ఓబీసీలకు కావాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓబీసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. జ్యోతిరావు పూలే కాలంనుంచి ఓబీసీలలో ఎవ్వరూ దేశంలో అత్యున్నతమైన పదవులు అనుభవించలేదని పేర్కొన్నారు.

06/12/2018 - 01:31

న్యూఢిల్లీ, జూన్ 11: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. దత్తాత్రేయ సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో దళితులపై మోదీ ప్రభుత్వంపై దాడులు చేస్తోందని వరంగల్ సభలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఆయన తప్పుబట్టారు.

06/12/2018 - 01:29

న్యూఢిల్లీ, జూన్ 11: దేశంలోని బ్లడ్‌బ్యాంకు (రక్తనిధి)లను ఇక నుంచి బ్లడ్ సెంటర్లుగా పిలుస్తారు. వీటన్నింటినీ ఒకే గొడుగుకిందకు తీసుకొచ్చి నియమ, నిబంధనలను అమలుచేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే బ్లడ్‌బ్యాంకుల పేర్లు బ్లడ్ సెంటర్లుగా మారనున్నాయి.

Pages