S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/11/2018 - 16:56

కుప్వారా : జమ్మూకాశ్మీర్‌లో భారీ స్థాయిలో ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కీరన్ సెక్టార్‌లో ఆదివారం ఉగ్రవాదులు చోరబాటుకు ప్రయత్నం చేశారు. అక్కడ భద్రతా అధికారులు గాలింపు చేపట్టారు. ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

06/11/2018 - 16:47

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయిను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్‌లోని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో ఆయనకు వైద్య సేవలు అందించనున్నారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే వాజ్‌పేయిను ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 93సంవత్సరాలు.

06/11/2018 - 12:40

గువహటి : అసోంలో సోమవారం సంభవించిన భూకంపం ప్రజలను భయకంపితులను చేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.1 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైన భూప్రకంపనలకు నాగోన్‌ జిల్లా ధింగ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం భూకంప ప్రధాన కేంద్రంగా ఉందని షిల్లాంగ్‌లోని ప్రాంతీయ సెసిమలాజికల్‌ సెంటర్‌ పేర్కొంది.

06/11/2018 - 12:25

ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని కన్షౌజ్ వద్ద ఆగ్రా - లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ హైవేపై విద్యార్థులపైకి బస్సు దూసుకెళ్లడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు.

06/11/2018 - 12:22

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణం ఆరాధనా నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతులు బీజేపీ కార్యకర్త కమలాకర్ పవన్‌కర్‌తో సహా అతని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

06/11/2018 - 03:45

ముంబయి: ‘ప్రాజెక్ట్ శక్తి’లో భాగంగా మంగళవారం ముంబయిలో పర్యటించనున్న రాహుల్ గాంధీకి, వెయ్యి ఆటోల్లో డ్రైవర్లు ఆహ్వానం పలుకనున్నారు. రాహుల్ ముంబయిలో ఒకరోజు పర్యటిస్తారని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ వెల్లడించారు. 100మంది డ్రైవర్లు తమ ఆటోలతో సహా వచ్చి రాహుల్‌కు ఆహ్వానం పలకడమంటే, ఆయనపట్ల వారికున్న ప్రేమకు నిదర్శనమన్నారు.

06/11/2018 - 01:56

న్యూఢిల్లీ, జూన్ 10: ఇంటర్‌నెట్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో కిప్యాడ్ జిహాదీ గ్రూపులు పెట్టే తప్పుడు ప్రచారాలను అదుపుచేసేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తు మొదలుపెట్టింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ద్వారా ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతున్నవారిని ఎదుర్కొనేందుకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది.

06/11/2018 - 01:55

న్యూఢిల్లీ, జూన్ 10: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయవద్దని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆదివారం ఢిల్లీలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు యాతకుల భాస్కర్ మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ చట్టాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

06/11/2018 - 01:54

న్యూఢిల్లీ, జూన్ 10: జాతీయతా వాదం తమకే సొంతం అంటూ ప్రచారం చేసుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సేవాదళ్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ప్రతి నెల ఆఖరు శనివారం దేశంలోని వెయ్యి నగరాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.

06/11/2018 - 01:54

న్యూఢిల్లీ, జూన్ 10: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేందుకు ఏ అధికారిని ప్రత్యేకంగా కేటాయించలేదని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధించి వివిధ వనరుల ద్వారా పెద్ద ఎత్తున సలహాలు, సూచనలు వేర్వేరు మంత్రిత్వశాఖలకు వస్తాయని కూడా పీఎంఓ పేర్కొంది.

Pages