S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/23/2016 - 07:40

వారణాసి: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు, ఇంధన సంక్షోభం, భయంకరమైన వ్యాధులను సవాళ్లుగా స్వీకరించి పరిష్కార మార్గాలు కనుక్కోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ‘కట్-పేస్ట్’ పద్ధతిలో కాకుండా సృజనాత్మక పరిశోధనల ద్వారా ఈ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలని ఆయన సూచించారు.

02/23/2016 - 07:39

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం జాట్ సామాజికవర్గ ప్రజలు సాగిస్తున్న ఆందోళనలతో అట్టుడుకుతున్న హర్యానాలో సోమవారం కూడా హింసాకాండ కొనసాగింది. గత తొమ్మిది రోజుల నుంచి సాగుతున్న ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య 19గానే ఉన్నప్పటికీ ఆందోళనకారులు సోమవారం భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడటంతో పాటు ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు.

02/23/2016 - 07:11

న్యూఢిల్లీ: నీటి ప్రాజెక్టులకు కేంద్రం సకాలంలో అనుమతుల ఇవ్వకపోవటం వల్లే ప్రాజెక్టుల ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. నిర్మాణంలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరగటంతోపాటు ప్రజలకు సకాలంలో నీరందటం లేదని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

02/23/2016 - 06:19

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో దాడులకు తెగబడిన ఉగ్రవాదులను ఎట్టకేలకు ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. సోమవారంతో ఆర్మీ ఆపరేషన్ ముగిసింది. శ్రీనగర్ నగర్ శివార్లలో శ్రీనగర్- జమ్మూ జాతీయ రహదారి పక్కనున్న ఎంటర్‌ప్రీనర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఇడిఐ) భవనంలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి భవనాన్ని స్వాధీనపర్చుకున్నాయి. 48 గంటలకు పైగా ఆర్మీ ఆపరేషన్ సాగింది.

02/23/2016 - 06:17

న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా హర్యానాలో జరుగుతున్న జాట్‌ల ఉద్యమం వల్ల మొత్తం ఉత్తర భారతానికి 34వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అలాగే దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయని పిహెచ్‌డి చాంబర్ అంచనా వేసింది.

02/23/2016 - 06:15

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు, పౌర సమాజం, విద్యార్థుల స్వేచ్ఛాగళాన్ని అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిని సోనియా ఎండగట్టారు. ఏ రకమైన స్వేచ్ఛ, ప్రశ్నించే తత్వం, చర్చ, అసమ్మతికి తావులేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

02/23/2016 - 06:14

న్యూఢిల్లీ: ఎన్డీయే సర్కారును ముప్పుతిప్పలు పెట్టేందుకు విపక్షాలు వివాదాస్పద ఆయుధాలతో సన్నద్ధమవుతున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. అయితే, దేశ భక్తి నినాదంతో విపక్షాలను ఎదురు దెబ్బ తీసేందుకు అధికారపక్షం ప్రతి వ్యూహం పన్నుతోంది.

02/22/2016 - 18:27

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గౌరవ డాక్టరేట్‌ను సున్నితంగా తిరస్కరించారు. తనకు ఈ విశ్వవిద్యాలయం ఎన్నో ఇచ్చిందని, వాటి ముందు డాక్టరేట్ తక్కువేనన్నారు. డాక్టరేట్‌ను తిరస్కరిస్తున్నందుకు వర్సీటీ అధ్యాపకులు తనను క్షమించాలని ఆయన కోరారు. గతంలోనూ మోదీ అమెరికాలో పర్యటించినపుడు లూసియానా వర్శిటీలో డాక్టరేట్‌ను తిరస్కరించారు.

02/22/2016 - 18:27

దిల్లీ: జాట్ కులస్థులకు రిజర్వేషన్లను కల్పించే అంశంపై చర్చించేందుకు ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో సోమవారం ఇక్కడ భేటీ అయింది. రిజర్వేషన్లు కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై కమిటీ సమావేశంలో చర్చించారు.

02/22/2016 - 17:37

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్ కులస్థులు సోమవారం కూడా పలు చోట్ల విధ్వంసకాండ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రోహ్తక్ జిల్లాలో పరిస్థితి దిగజారింది. సోమవారం ఆందోళనకారులు ఓ గూడ్సురైలులో నాలుగు బోగీలకు, ఓ న్యాయమూర్తి కారుకు నిప్పు పెట్టారు. అనేక ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించడంతో అక్కడికి చేరుకునేందుకు భద్రతాదళాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

Pages