S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/26/2016 - 16:29

దిల్లీ: వీధి కుక్కలను చంపాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రమంత్రి మేనకాగాంధీ తప్పుబట్టారు. కుక్కల వ్యాక్సినైజేషన్‌కు ఎంతమేరకు ఖర్చు పెడుతున్నారని కేరళ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ‘కుక్కలు కరుస్తాయని, వాటిని చంపుతూ పోతుంటారా? ’ అని ఆమె ప్రశ్నించారు. పట్టణీకరణ నేపథ్యంలో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని, అందుకోసం కుక్కలను చంపడమే పరిష్కారం కాదని అన్నారు.

08/26/2016 - 12:55

ముంబయి: ముంబయిలోని హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. మహిళలు కూడా దర్గాలోనికి వెళ్లొచ్చని, రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

08/26/2016 - 12:11

ఢిల్లీ: నిర్భయ కేసులో దోషులను వెంటనే ఉరి తీయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో స్వాతి స్పందించారు. అత్యాచారానికి పాల్పడిన ప్రతి ఒక్కరికి మరణశిక్ష విధించాలి. మరెవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు పంపాల'ని స్వాతి అన్నారు.

08/26/2016 - 03:18

హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కారణం గా తెలంగాణకు నష్టం జరగకుండా తక్షణం తాము తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఒప్పందం కారణంగా తెలంగాణకు జరిగే నష్టాలను ఆయన మీడియాకు వివరించారు.

08/26/2016 - 03:02

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఫ్రాన్స్ సహకారంతో భారత్‌లో తయారవుతున్న స్కార్పీన్ జలాంతర్గామి కీలక వివరాలకు సంబంధించి మరిన్ని రహస్య పత్రాలు గురువారం బహిర్గతమయ్యాయి. బుధవారం కీలక సాంకేతిక సమాచారం ఉన్న వేలాది పత్రాలను వెలుగులోకి తెచ్చిన ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక తాజాగా మరికొన్నింటిని బయటపెట్టింది. ఈ తాజా వివరాలు స్కార్పీన్ జలాంతర్గాముల యుద్ధ తంత్ర వ్యవస్థకు సంబంధించినవి.

08/26/2016 - 02:56

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రైలు టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే కేవలం 92 పైసల ప్రీమియం చెల్లింపుపైన ప్రయాణికులకు పదిలక్షల వరకూ ప్రయాణ బీమా లభిస్తుంది. ఈ నెలాఖరు నుంచి ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలులోకి వస్తుంది. ఐఆర్‌టిసి వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వారికి ఐచ్ఛిక ప్రాతిపదికన ఈ ప్రయాణ బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

08/26/2016 - 04:21

చెన్నై, ఆగస్టు 25: తమిళనాడులో భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. ప్లైవుడ్ షీట్లుగా పేర్కొంటూ అక్రమంగా రవాణా అయిన ఈ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 7 కోట్ల రూపాయలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

,
08/26/2016 - 01:16

చిత్రాలు.. కృష్ణాష్టమి సందర్భంగా గురువారం మధురలోని శ్రీ కృష్ణాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న భక్తులు.
కృష్ణాష్టమి రోజున చిన్నపిల్లలకు గోపాలుడి వేషాలు వేసి ముచ్చట తీర్చుకోవడం మామూలే. అయతే జైపూర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి చిన్నికృష్ణుడితోపాటు తల్లిదండ్రులు కూడా నందుడు, యశోదల్లా అలంకరించుకుని మరీ వచ్చారు.

08/26/2016 - 01:13

శ్రీనగర్, ఆగస్టు 25: జమ్మూ, కాశ్మీర్‌లో తాజా అల్లర్లలో పెద్ద ఎత్తున గాయాలకు కారణమైన పెల్లెట్ గన్స్ స్థానంలోనే కొద్ది రోజుల్లోనే ప్రత్యామ్నాయాలను ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కాశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకోసం బుధవారం వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మెహబూబాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

08/26/2016 - 01:11

ముంబయి, ఆగస్టు 25: సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తోసిరాజని మహారాష్ట్ర అంతటా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. మైనర్లు వేడుకల్లో పాల్గొనకూడదని, మానవ పిరమిడ్లు ఎత్తు 20 అడుగులు మించకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ముంబయి సహా పలు పట్టణాల్లో ఎక్కడా కోర్టు నిబంధనలు పట్టించుకోలేదు. ఇరవై అడుగుల కంటే ఎక్కువ ఎత్తునలో మానవ పిరమిడ్లు ఏర్పాటు చేయవద్దని బుధవారం సుప్రీం ఆదేశించింది.

Pages