S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/08/2018 - 04:13

బెంగళూరు, జూన్ 7: ప్రముఖ నటుడు రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాకు కర్నాటకలో కావేరి సెగ తగిలింది. గురువారం రాష్ట్రంలో విడుదలైన ఈ సినిమాను ప్రదర్శించకుండా పలుచోట్ల కన్నడిగులు అడ్డుకున్నారు. పలు సినిమా హాళ్ల వారు సైతం ఈ సినిమాను ప్రదర్శించమని పేర్కొనడంతో తమిళ సూపర్‌స్టార్ రజనీ అభిమానులు నిరాశ చెందారు. బెంగళూరులో ఈ సినిమా ప్రదర్శితమైన అన్ని థియేటర్ల ముందు ఆందోళనకారులు నిరసన తెలిపారు.

06/08/2018 - 02:33

తిరుచిరాపల్లి, జూన్ 7: నీట్‌లో వైఫల్యాలు విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్నాయి. తమిళనాడులో తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో సుభశ్రీ అనే విద్యార్థినికి 24 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో తీవ్ర నైరాశ్యానికిలోనై బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుంది.

06/08/2018 - 04:15

చిత్రం: పీటర్ మారిట్జ్‌బర్గ్‌లోని
‘బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ అని పిలవబడే
రెండు పార్శ్వాలు కలిగిన మహాత్మా గాంధీ
విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్

06/08/2018 - 04:18

నాగ్‌పూర్, జూన్ 7: భారత జాతీయవాదం సుసంపన్నమైనదని, మతం, ప్రాంతం ప్రాతిపదికన ద్వేషం, అసహనాన్ని రెచ్చగొట్టడం ద్వారా జాతీయ వాదానికి కొత్త నిర్వచనాలు ఇచ్చే విధానాన్ని ప్రజలు అంగీకరించరని భారత పూర్వ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారత్ శక్తి సహనంలో ఉందని, బహుళత్వాన్ని గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత జాతీయ వాదంలో విశ్వ సౌభ్రాతృత్వం దాగి ఉందని ఆయన అన్నారు.

06/08/2018 - 04:19

న్యూఢిల్లీ, జూన్ 7: ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడిగా ఉమెన్ చాందీ గురువారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు.

06/08/2018 - 04:21

న్యూఢిల్లీ, జూన్ 7: ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ పథకం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇతర ఆరోగ్య సంబంధ పథకాల లబ్ధిదారులతో ప్రధాని వీడియో బ్రిడ్జ్‌ద్వారా సమీక్షించారు. దేశాభివృద్ధికి ప్రజారోగ్యమే మూలమని, 125కోట్ల మంది ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే గొప్ప దేశం కాగలుగుతుందని స్పష్టం చేశారు.

06/07/2018 - 17:04

కోచి: భారత ఎల్‌పీజీ ట్యాంకర్ నౌక చేపల వేటకు వెళ్లిన బోటును ఢీకొట్టింది. మునాంబమ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు 4 గంటలకు చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులకు గాయాలయ్యాయి. ఇద్దరిని పరవూర్‌కు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు.

06/07/2018 - 16:57

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేషరినాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు అప్పగించారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. త్రిపుర ప్రస్తుత గవర్నర్ తతగట రాయ్ సెలవుపై ఉన్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

06/07/2018 - 16:25

న్యూఢిల్లీ : జనతాదళ్ యునైటెడ్ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడని ప్రకటించిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు లభించవలసిన జీతం, ఇతర భత్యాలు, సదుపాయాలను నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విమానం, రైలు టిక్కెట్ల వంటి సదుపాయాలను కూడా నిలిపేయాలని స్పష్టం చేసింది.

06/07/2018 - 14:10

న్యూఢిల్లీ: ‘ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన కార్యక్రమం’ లబ్ధిదారులతో మోదీ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా గురువారం ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందుబాటు ధరలకే ఔషధాలను అందించడం కోసమే భారతీయ జనఔషధి పరియోజన కార్యక్రమం ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. స్టెంట్ ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు.

Pages