S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/07/2018 - 13:31

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జమ్మూ కాశ్మీర్ చేరుకున్నఆయన వెంట కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, జమ్మూ కశ్మీర్ జాయింట్ సెక్రటరీ జ్ఞానేశ్ కుమార్, పీఎంవో సహాయమంత్రి జితేంద్ర సింగ్ సహా పలువురు అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో హోంమంత్రి పర్యటన తమకు కీలకమైనదనీ...

06/07/2018 - 03:42

బెంగళూరు: హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ఎట్టకేలకు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కేబినెట్‌లోని 25 మంత్రులను తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది, జేడీఎస్‌ను నుంచి తొమ్మిది మందికి మంత్రి పదవులు దక్కాయి. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఎలాంటి అట్టహాసం లేకుండా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగింది.

06/07/2018 - 03:28

న్యూఢిల్లీ, జూన్ 6: ఉగ్రవాదం, పర్యావరణ మార్పులు వంటి కీలక అంశాలపై పోరాటం జరపడంలో భారత్ ముందున్నదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీసు ఆఫీసర్-ట్రైనీలతో ఆయన మాట్లాడుతూ, ఈ సర్వీసులో చేరడం ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా భారత్ తన అడుగులను విస్తరిస్తోంది. ప్రపంచంలోని ప్రతి భాగంలో మన ప్రయోజనాలను కాపాడుకుంటున్నాం.

06/07/2018 - 03:24

న్యూఢిల్లీ, జూన్ 6: హెచ్-1బీ వీసా, హెచ్-4 వీసాల జారీలో ఎటువంటి మార్పులు ఉండవు.గత కొంత కాలంగా ఈ రెండు కేటగిరీ వీసాల జారీ ప్రక్రియలో సమూలాత్మకమైన మార్పులు వస్తాయని అమెరికా ప్రభుత్వం సంకేతాలు పంపింది. దీంతో అమెరికా వెళ్లి స్థిరపడిన భారత్‌తో సహా పలు దేశాల ఉద్యోగులు, నిపుణులు తీవ్రమైన ఆందోళనకుగురయ్యారు.కాని ఈ రెండు రకాల వీసాల్లో మార్పులు ఉండవని అమెరికా ప్రకటించింది.

06/07/2018 - 03:21

న్యూఢిల్లీ, జూన్ 6: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో రెండో విడత విచారణకు జూన్ 12న హాజరుకావాలని ఈడీ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సమన్లు పంపింది. మంగళవారం మొదటి విడతగా ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మనీలాండరింగ్ చట్టం కింద ఆయన్ను మొదటిసారి ఆరుగంటలపాటు ప్రశ్నించి ఆయన సమాధానాలను రికార్డు చేసింది.

06/07/2018 - 04:43

ముంబయి, జూన్ 6: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలనాథులు కసరత్తు ప్రారంభించారు. ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ప్రముఖులందర్నీ కలుసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ముంబయి సబర్బన్‌లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను బుధవారం కలుసుకున్నారు.

06/07/2018 - 02:56

న్యూఢిల్లీ, జూన్ 6: దేశంలోని యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలోని డెహ్రాడూన్, గౌహతి, రాయపూర్ తదితర నగరాల నుంచి వచ్చిన యువ పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడుతూ స్టార్టప్‌లు కేవలం పెద్దపెద్ద నగరాలకే పరిమితం కావాలన్న నిర్బంధం ఏమీ లేదని, చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లో సైతం వీటిని విస్తృతంగా ప్రారంభించాలని సూచించారు.

06/07/2018 - 04:55

న్యూఢిల్లీ,జూన్ 6: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా సమితి అన్ని అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర జల సంఘం కార్యాలయంలో బుధవారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యు.పి.సింగ్ అధ్యక్షతన జరిగిన సాంకేతిక సలహా సమితి సమావేశంలో కాళేశ్వరం ప్రాజక్టుకు ఆమోద ముద్ర వేశారు.

06/07/2018 - 05:00

న్యూఢిల్లీ, జూన్ 6: దేశంలోని చెరుకు రైతులను ఆదుకునేందుకు ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న రెండు లక్షల అరవై వేల మంది పోస్టల్ సిబ్బంది వేతనాలను గణనీయంగా పెంచారు. చంద్రయాన్(2)ను అక్టోబర్, నవంబర్‌లో ప్రయోగించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. చంద్రయాన్(2)లో లాండ్ రోవర్ కూడా ఉంటుంది.

06/07/2018 - 04:56

న్యూఢిల్లీ, జూన్ 6: ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చే రుణ (పీఎస్‌ఎల్) విధానం కింద గృహ నిర్మాణ రుణ పరిమితులను పెంచినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. దీని ప్రకారం మెట్రోపాలిటన్ నగరాల్లో (పదిలక్షలకు మించిన జనాభా కలిగిన నగరాలు) పీఎస్‌ఎల్ అర్హత పొందిన గృహ రుణాల పరిమితిని ఇప్పటివరకు ఉన్న రూ.28 లక్షలనుంచి రూ.35 లక్షలకు పెంచింది.

Pages