S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/04/2018 - 02:12

కోల్‌కతా, జూన్ 3: ప్రాథమిక తరగతుల్లోని 1, 2 విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకుండా స్కూళ్లను కట్టడి చేసేందుకు త్వరలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మానవ వనరుల మత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. 1, 2 తరగతుల విద్యార్థులకు పుస్తకాల మోత తగ్గించాలని, హోంవర్క్‌తో భారం మోపొద్దని రాష్ట్రాలను ఆదేశించాలంటూ మే 30న మద్రాస్ హైకోర్టు కేంద్రానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.

06/04/2018 - 02:11

పనాజీ, జూన్ 3: 2019 ఎన్నికల్లో ప్రధాని పోస్ట్ ఖాళీ లేదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చమత్కరించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

06/04/2018 - 02:08

చండీగఢ్, జూన్ 3: పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతుల ఆందోళన ఉధృతమైంది. వరుసగా మూడోరోజు కూడా రైతులు తమ పంటలను రోడ్డుపైన పారేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఆందోళన హింసాత్మకం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు కూరగాయలను రోడ్డుపారేస్తే, మరో వైపు ఉత్తరాది పట్టణాల మార్కెట్లలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి.

06/04/2018 - 02:06

95వ జన్మదినం సందర్భంగా డీఎంకే అధినేత కరుణానిధి బుధవారం పార్టీ కార్యకర్తలను కలుసుకున్నప్పటి చిత్రం

06/04/2018 - 02:05

న్యూఢిల్లీ, జూన్ 3: అమెరికా రాజకీయాలను తెలుగువారు శాసించే స్థాయికి ఎదగాలని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ తెలుగు సంఘం (టాటా) సంయుక్తంగా యార్లగడ్డకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశాయి.

06/04/2018 - 02:04

న్యూఢిల్లీ, జూన్ 3: రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా బిలియన్ డాలర్ల వ్యయంతో 200 కమోవ్ క-226టి అనే యుద్ధ హెలికాప్టర్లను రష్యా నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదనలను కేంద్రం ఆమోదం తెలిపింది. రష్యన్ హెలికాప్టర్స్ సంస్థ, భారత్ ఏరో స్పేస్ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య ఈ మేరకు వచ్చే అక్టోబర్ నాటికి ఒప్పందం అమలవుతుంది.

06/04/2018 - 02:02

తూత్తుకుడి, జూన్ 3: తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఘటనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరపగా, 13 మంది మరణించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఈ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయించాలని ఆయన కోరారు.

06/04/2018 - 02:01

న్యూఢిల్లీ, జూన్ 3: పెద్ద నోట్ల రద్దు తర్వాత 73వేల కంపెనీలకు చెందిన రూ.24వేల కోట్లు బ్యాంకు అకౌంట్లలో మూలుగుతున్నట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బ్యాంకులు నివేదికలిచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత, నల్లధనం వెలికితీతకు కేంద్రం పెద్దఎత్తున నిఘాను పెంచిన విషయం విదితమే. కంపెనీలు ప్రారంభించాలని 2.26 లక్షల సంస్థలు నమోదు చేసుకున్నాయి.

06/04/2018 - 02:01

న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల రెండు రోజుల సదస్సు ఈ నెల 4,5 తేదీల్లో రాష్టప్రతి భవన్‌లో జరుగుతుంది. సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సదస్సులో స్వచ్ఛ్ భారత్, అంతరంగిక భద్రత అంశాలపై చర్చిస్తారు. జాతీయ స్థాయి 49వ గవర్నర్ల సదస్సు సందర్భంగా రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. 1949లో గవర్నర్ల తొలి సదస్సు రాష్టప్రతి భవన్‌లో జరిగింది.

06/04/2018 - 02:00

రాంచి, జూన్ 3: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో విపక్షాలు పొత్తుపెట్టుకుని ఏకం కావడాన్ని తాత్కాలిక బంధంగా ఆయన కొట్టివేశారు. ప్రస్తుతం నాయకత్వ విషయంలో ప్రతిపక్షాలు చాలా బలహీన పరిస్థితుల్లో ఉన్నాయని ఆయన అన్నారు.

Pages