S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/18/2018 - 12:36

ముంబయి: సినిమా అవకాశాలు లేక తాను ఆత్మహత్య చేసుకున్నానని మీడియాలో వచ్చిన వదంతులను రుద్రమదేవీ రచయిత రాజసింహ ఖండించారు. తనకు మధుమేహం ఉందని, దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో షుగర్ లెవల్స్ పడిపోవటంతో కుప్పకూలిపోయానని అన్నారు. తరవాత మా ఇంట్లోవాళ్లు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.

05/18/2018 - 12:35

హైదరాబాద్: కర్నాటక రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. బల నిరూపణ కోసం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసేందుకు ప్రయత్నిస్తుందని భావించి ఎమ్మెల్యేలను తమకు అనువైన ప్రదేశాలకు గోప్యంగా తరలించారు. అయితే ఎమ్మేల్యేలకు కల్పించిన భద్రతను కర్నాటక పోలీసులు ఉపసంహరించుకోవటంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలని భావించారు.

05/18/2018 - 04:27

బెంగళూరు: ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటే యెడ్యూరప్ప ఎట్టకేలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి న భాజపాను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో, యెడ్యూరప్ప 23వ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా రు. గవర్నర్ విధించిన 15 రోజుల గడువులోగా ఆయన బలపరీక్షలో నెగ్గితేనే ప్రభుత్వం నిలుస్తుంది.

05/18/2018 - 02:10

న్యూఢిల్లీ,మే 17: స్వచ్చత వ్యర్థాల నిర్వహణపై ఆంధ్రభవన్ ప్రత్యేక కమిషనర్ రజత్ బార్గవ్ రచించిన ‘ఏ ట్రిటిస్ ఆన్ క్లీన్‌లినెస్’,‘వేస్ట్ మేనేజ్‌మెంట్’పుస్తకాలను ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అవిష్కరించారు. వెంకయ్య నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాల అవిష్కరణ కార్యక్రమం జరిగిం ది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రకృతిని మనమందరం ప్రేమించాలని పిలుపునిచ్చారు.

05/18/2018 - 02:09

న్యూఢిల్లీ, మే 17: దేశంలో 2050 నాటికి నగరాల్లో జనాభా ఊహించని స్థాయిలో పెరిగిపోతుందని, ఇంచుమించు దేశజనాభాలో సగం వరకు నగరాల్లోని నివసిస్తారని, వారికి అవసరమైన సదుపాయాల కల్పనకు గృహ, వౌలికసదుపాయాల విభాగాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని, వాటిని తీర్చడానికి ఇప్పటి నుంచే హరితభవనాలు అభివృద్ధి లాంటి చర్యలు అవసరమని ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు.

05/18/2018 - 02:03

న్యూఢిల్లీ, మే 17: తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్, కేవ లం అవకాశవాద రాజకీయంతోనే జేడీ(ఎస్)తో జట్టు కట్టిందని భాజ పా అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కర్నాటకలో ప్రజాస్వా మ్యం ఖూనీ అయిందంటూ కాంగ్రెస్ చేసిన విమర్శను తిప్పికొడు తూ షా పై విధంగా పేర్కొన్నారు.

05/18/2018 - 02:02

న్యూఢిల్లీ, మే 17: కర్నాటక అసెంబ్లీలో ఆంగ్లోఇండియన్ మెంబర్‌ను నామినేట్ చేయాలని గవర్నర్ వాజుభాయి తీసుకున్న నిర్ణయా న్ని నిలిపివేయించాలని, విధానసభలో బీజేపీ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకునే వరకు ఈ ప్రక్రియను ఆపుచేయించాలని కాంగ్రె స్, జేడీ(ఎస్) గురువారం సుప్రీంను ఆశ్రయించాయి. కర్నాటక అసెంబ్లీ లో మొత్తం 224 మంది సభ్యులుండగా, ఆంగ్లో ఇండియన్ మెంబర్ ను నామినేట్ చేస్తే ఆ సంఖ్య 225కు చేరుతుంది.

05/18/2018 - 02:01

న్యూఢిల్లీ,మే 17: దేశ వ్యాప్తంగా ఉన్న నదీ తీరాలు,బీచ్‌లకు,సరస్సులను పరిశుభ్రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2018 జూన్ 5 వరకు దేశంలోని నది తీరాలు, బీచ్‌లు, సరస్సులను శుభ్రం చేసేందకు 19 ప్రత్యేక బృందాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పా టు చేసింది.

05/18/2018 - 01:10

బెంగళూరు, మే 17: అసెంబ్లీలో జరిగే బలనిరూపణలో విజయం సాధిస్తామని, విశ్వాస తీర్మానంలో నెగ్గుతామని కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీఎస్ యెడ్యూరప్ప ప్రకటించారు. ఉన్నతాధికారులతో తొలి సమావేశం నిర్వహించిన తర్వాత గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.

05/18/2018 - 01:04

న్యూఢిల్లీ, మే 17: కర్నాటక గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై తక్షణం విచారణ జరపాలని కోరుతూ బుధవారం రాత్రి కాంగ్రెస్-జెడీఎస్‌లు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది రోహిద్గీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆయన వాదిస్తూ, ఇదేమీ 2015లో ముంబయి దాడుల కేసులో ఉరిశిక్షకు గురైన యాకుబ్ మెమెన్ కేసనుకున్నారా? అంటూ ప్రశ్నించారు.

Pages