S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/18/2018 - 01:03

న్యూ ఢిల్లీ, మే 17: కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి అరాచకాన్ని సృష్టించిన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు, భావసారూప్యత ఉన్న పార్టీలు కలిసి రావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు.

05/18/2018 - 04:23

బెంగళూరు: మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్‌పట్నాయక్, తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు కలిసి రావాలని కర్నాటకలోని జేడీ(ఎస్) నేత కుమారస్వామి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

05/18/2018 - 01:01

పానాజి, మే 17: అధికారం చేపట్టడానికి అవసరమైన పూర్తి మెజారిటీ లేకున్నా ఏకైక అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని సీఎం పీఠంపైకి ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయం ప్రభావం గోవా రాష్ట్రంపై పడింది. రాష్ట్రంలో తమది కూడా ఏకైక అతిపెద్ద పార్టీ అని, తమను కాకుండా గోవా ఫార్వర్డ్, పార్టీ, ఎంజిపి పార్టీల సంకీర్ణంతో ఏర్పడిన బీజేపీకి గతంలో ఎలా అధికారాన్ని ఇచ్చారని కాంగ్రెస్ ఇప్పుడు ప్రశ్నిస్తోంది.

05/18/2018 - 01:01

న్యూఢిల్లీ,మే 17: కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు అమెరికన్ తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసొసియేషన్(టాటా)లు కలిసి జీవిత సాఫల్య పుస్కారాన్ని ప్రకటించాయి. యార్లగడ్డకు మే 31, జూన్ 1,2 తేదీలలో డల్లాస్‌లో రెండు సంస్థలు ఏర్పాటు చేసిన సదస్సులో ఈ పురస్కారం అందజేయనున్నట్టు ఆటా అధ్యక్షుడు డా.కరుణాకర్‌రెడ్డి, టాటా అధ్యక్షుడు డా.హరినాథ్ పొలిచెర్ల ప్రకటించారు.

05/18/2018 - 02:18

న్యూఢిల్లీ,మే 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయె ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే విధంగా 15వ ఆర్థిక సంఘం నియమ, నిబంధనలను తయారు చేసి రాష్ట్రాలను బికారులను చేస్తోందని ఆరు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్థిక సంఘం నియమ, ని బంధనలను సవరించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.

05/18/2018 - 00:26

రాయ్‌పూర్, మే 17: దేశంలో నియంతృత్వ పోగడలు పెరిగిపోయానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇవి చివరికి రాజ్యాంగానికే ముప్పుగా పరిణమించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్నాటకలో తాజా రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

05/18/2018 - 00:20

బెంగళూరు, మే 17: కర్నాటక ముఖ్యమంత్రిగా బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి బిఎస్ యెడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్ పక్షాల నిరసనలు, సుప్రీం కోర్టులో అర్ధరాత్రి దాటిన తర్వాత కేసు విచారణ తదితర ఉత్కంఠభరితమైన పరిస్థితుల మధ్య మూడోసారి గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.

05/17/2018 - 15:40

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. 1,062 గ్రామ పంచాయతీలకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం టీఎంసీ -932, బీజేపీ -82, కాంగ్రెస్‌ -8, వామపక్షాల- 7, ఇతరులు- 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఎంసీ -147, బీజేపీ-1, కాంగ్రెస్-1 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తున్నాయి.

05/17/2018 - 15:20

విశాఖపట్నం: విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన హామీలుపై జనసేన పోరుబాట పడుతోందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. గురువారం విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి పోరాట యాత్ర ప్రారంభిస్తామని పవన్‌ చెప్పారు.

05/17/2018 - 15:12

బెంగళూరు: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే యడ్యూరప్ప. రూ. 56 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రైతులకు సంఘీభావంగా ఆయన పచ్చ కండువా కప్పుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

Pages