S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/16/2018 - 17:22

బెంగళూరు: కర్నాటకలో యడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జయదేవకర్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు, మంత్రి పదవి ఇస్తూ బీజేపీ ప్రలోభ పెడుతుందనేది ఊహజనితం అని అన్నారు. బీజేపీ ప్రజాస్వామిక పద్ధతుల్లోనే నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైందని విమర్శించారు.

05/16/2018 - 17:19

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలలో భాగంగా కేంద్రీయ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనంతపురం జిల్లా జంతలూరు వద్ద ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నారు. యూనివర్శిటీకి అవసరమైన భవనాలు నిర్మించే వరకు పాత భవనాల్లోనే కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్ర కేబినెట్ వివరాలను మంత్రి శివశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

05/16/2018 - 13:44

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ స్థాయిలో గాలివాన వచ్చింది. పెనుగాలులకు నగరంలోని కొన్ని ప్రాంతాలు వణికిపోయాయి. నారనౌల్, అల్వార్, రోహతక్, జింద్, భివాని, జాజర్, రెవారి, నుహ్, పల్వాల్ ప్రాంతాల్లోనూ వాతావరణం భయానకంగా ఉన్నది. ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో ఇదే రకమైన వాతావరణం ఉంటుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది.

05/16/2018 - 13:31

బెంగళూరు: కన్నడ నాట కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాసేపట్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి వారి ఆచూకీ తెలియడం లేదు. ఆమ్నాబాద్‌ ఎమ్మెల్యే రాజశేఖర్‌ బి. పాటిల్‌, నగేంద్ర(కూడ్లగి‌), ఆనంద్‌ సింగ్‌(విజయ నగర)తో పాటు భీమా నాయక్‌, అమేర్‌ గౌడ నాయక్‌ తదితరులు ఉన్నారు.

05/16/2018 - 13:27

బెంగళూరు: మాఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకి వంద కోట్లు ఇస్తామంటున్నారని.. మంత్రి పదవి ఆశ చూపిస్తున్నారని బీజేపీపై జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరులో పార్టీ శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం కుమారస్వామి మట్లాడుతూ ఐటీ దాడులు చేస్తామంటూ తమ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

05/16/2018 - 13:15

ఖాట్మండ్ : నేపాల్‌లోని ముక్తినాథ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని నేపాల్ హోంమంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

05/16/2018 - 13:11

బెంగుళూరు: కర్నాటకలో జేడీఎస్ ఎల్పీ నేతగా హెచ్‌డీ కుమారస్వామి ఎన్నికయ్యారు. బెంగుళూరులో జరిగిన జేడీఎస్ మీటింగ్‌లో కుమారస్వామిని పార్టీ చీఫ్‌గా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేత మంజూనాథ్ తెలిపారు. బీజేపీ పార్టీ చీఫ్‌గా యడ్యూరప్పను ఎన్నుకున్నది. గవర్నర్ వాజూభాయ్ వాలాకు ఆ లేఖను సమర్పించినట్లు యడ్యూరప్పచెప్పారు. గవర్నర్ తనకు ఆహ్వానం అందిస్తారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు.

05/16/2018 - 04:28

జమ్ము: పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో 28 ఏళ్ళ బీఎస్‌ఎఫ్ జవాను అమరుడయ్యాడు. పాక్ దళాలు ఉగ్రవాదులను చొప్పించేందుకు సాంబా సెక్టార్‌లో జరిపిన కాల్పుల్లోఈ దారుణం జరిగిందని బీఎస్‌ఎఫ్ చీఫ్ కె.కె. శర్మ తెలిపారు.

05/16/2018 - 01:53

న్యూ ఢిల్లీ, మే 15: కౌమారంలో అడుగుపెట్టిన బాలికలను లైంగిక వేధింపులు ఎదురవుతాయన్న భయం వెంటాడుతుంటుంది. ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరిని లైంగిక వేధింపుల భయం, ప్రతి ఐదుగురిలో ఒక బాలికను లైంగిక దాడులు, అత్యాచారానికి గురవుతామేమోనన్న భయం వెంటాడుతుంటుంది. బహిరంగ ప్రదేశాల్లో బాలికల సేఫ్టీ అనే అంశంపై సేవ్ ది చిల్ట్రన్ అనే ఎన్జీవో సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేకు వింగ్స్ 2018 అని నామకరణం చేశారు.

05/16/2018 - 01:48

న్యూఢిల్లీ, మే 15: లోక్‌పాల్ ఎంపిక కమిటీలో న్యాయవేత్తగా ప్రముఖ సీనియర్ న్యాయవాది రోహత్గిని నియమిస్తున్నట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు మంగళవారం తెలియజేసింది. రోహత్గిని న్యాయవేత్తగా నియమించేందుకు ఈ నెల 11నే ప్రభుత్వం నిర్ణయించిందని అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్... జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వెల్లడించారు. ఈ ఎంపిక కమిటీకి ప్రధాని నేతృత్వం వహిస్తారు.

Pages