S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/01/2016 - 00:46

న్యూఢిల్లీ, జూన్ 30: ‘అత్యాచారం’ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జాతీయ మహిళా కమిషన్ తాజాగా సమన్లు పంపింది. తన వ్యాఖ్యల విషయంలో సల్మాన్ ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, దీని దృష్ట్యా జూలై 8న తమముందు హాజరుకావాలని ఆదేశించింది. సమన్లను ఖాతరు చేయని పక్షంలో చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.

07/01/2016 - 00:45

న్యూఢిల్లీ, జూన్ 30: ఏడో వేతన సంఘ సిఫార్సులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై 11న చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 70 ఏళ్లలో ఇలాంటి సిఫార్సులు చూడలేదని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తనకు తీవ్ర అన్యాయం చేసిందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు.

07/01/2016 - 00:45

న్యూఢిల్లీ, జూన్ 30: స్వలింగ సంపర్కులను మూడో వర్గంకిందికి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిజ్రాలను మాత్రమే మూడోవర్గంగా పరిగణించాలని కూడా తేల్చి చెప్పింది. హిజ్రాలకు సంబంధించి 2014 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సవరించడానికి సైతం న్యాయమూర్తులు ఎకె సిక్రీ, ఎన్‌వి రమణలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

06/30/2016 - 18:18

హైదరాబాద్: పాతబస్తీలో ఉగ్రవాద సానుభూతిపరులను విచారించిన సందర్భంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులకు కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. పాతబస్తీలో బుధవారం ఉదయం 11 మందిని అదుపులోకి తీసుకుని ఎన్‌ఐఎ అధికారులు లోతుగా విచారించారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని పేల్చివేసేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న విషయాన్ని విచారణలో అనుమానిత వ్యక్తులు వెల్లడించినట్టు సమాచారం.

06/30/2016 - 18:00

దిల్లీ: పార్లమెంటు లైబ్రరీ భవనంలో కేంద్ర కేబినెట్‌ సమావేశం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది. శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై మోదీ సమీక్షిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలను మంత్రులు ప్రధానికి అందజేశారు.

06/30/2016 - 17:56

శ్రీనగర్‌: శ్రీనగర్‌లో గురువారం ఎయిర్‌ ఇండియా ల్యాండ్‌ అవుతుండగా రెండు టైర్లు పేలాయి. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో సెంట్రల్‌ పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని విమానాశ్రయ పోలీసు అధికారి వెల్లడించారు.

06/30/2016 - 17:46

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శాసనసభ స్పీకర్ కవీందర్ గుప్తా సమక్షంలో గురువారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన అనంత్‌నాగ్ ఉపఎన్నికలో ఆమె ఎమ్మెల్యేగా 12వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆమె తన రాజకీయ జీవితంలో నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

06/30/2016 - 15:59

లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఎదురుదెబ్బలు తగులున్నాయి. పార్టీ శాసనసభాపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి గుడ్ బై చెప్పి 10 రోజులు గడవకముందే మాజీ మంత్రి ఆర్కే చౌదరి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికలకు ముందు సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండడం పట్ల బీఎస్పీలో కలవరం రేపుతోంది. మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని నాయకులు ఆరోపించారు.

06/30/2016 - 15:09

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఇటీవల వైకాపా నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు కలిగిస్తున్న పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోవాలని కోరుతూ వైకాపా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

06/30/2016 - 13:07

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో భద్రత దళాలకు, వేర్పాటువాద గెరిల్లాలకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు వేర్పాటువాదులను భద్రత సిబ్బంది మట్టుబెట్టారు. మల్లార గ్రామంలో గెరిల్లాలు దాగి ఉన్నట్లు భద్రత సిబ్బందికి సమాచారం అందింది. దీంతో భద్రత సిబ్బంది స్థానికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన గెరిల్లాలు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.

Pages