S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/15/2018 - 16:20

బెంగళూరు: కర్నాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. పెద్ద పార్టీగా బీజేపీ, రెండవ పార్టీగా కాంగ్రెస్, మూడవ స్థానంలో జేడీఎస్ నిలిచాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్‌కు మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవి జేడీఎస్‌కు, ఉప ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ తీసుకునేటట్లు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

05/15/2018 - 14:02

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బాదామి నుంచి బరిలో నిలిచిన సీఎం సిద్ధరామయ్య (కాంగ్రెస్‌) విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి శ్రీరాములు (భాజపా) పై 3 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. బాదామిలో ఓడిన భాజపా నేత శ్రీరాములు మొళకాల్మూరులో గెలుపొందారు.

05/15/2018 - 13:57

బెంగళూరు: టాలీవుడ్‌ నటుడు సాయికుమార్‌ ఓటమి పాలయ్యారు. బాగేపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ తరఫున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌పై భారీ తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌ ఎన్‌ సుబ్బారెడ్డి 41వేల ఓట్లతో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి సాయికుమార్‌ గతంలో కూడా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు.

05/15/2018 - 12:32

బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు విషయంపై భారతీయ జనతాపార్టీ నేత సదానంద గౌడను విలేకరులు ప్రశ్నించగా.. అసలు పొత్తు ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. భాజపా 110 స్థానాలకు పైగా సాధించే అవకాశం స్పష్టంగా ఉన్నందున పొత్తుతో పనిలేదని, తాము సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గౌడ వెల్లడించారు.

05/15/2018 - 12:29

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పూర్తి మెజారిటీ దిశగా పయనిస్తుండంతో కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీకి పట్టం కట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు బలంగా నమ్మారని తెలిపారు. కర్ణాటకను అభివృద్ధి బాట పట్టిస్తామని అన్నారు.

05/15/2018 - 12:13

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో అధికారం చేపట్టే దిశగా భారతీయ జనతాపార్టీ అడుగులు వేస్తుండటంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. 260 పాయింట్లకుపైగా లాభంతో సెన్సెక్స్ దూసుకెళ్తున్నది. 35817 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 10877 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతున్నది.

05/15/2018 - 16:45

బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి సోదరులిద్దరూ సత్తా చాటుతున్నారు. బళ్లారి సిటీలో గాలి సోమశేఖర రెడ్డి, హరప్పనహళ్లిలో గాలి కరుణాకర్‌రెడ్డి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బళ్లారి(ఎస్టీ)లో గాలి అనుచరుడు ఫకీరప్ప ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి పోటీ చేయకపోయినప్పటికీ..

05/15/2018 - 12:35

బెంగళూరు: భారతీయ జనతాపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప షికారపుర నుంచి విజయం సాధించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాదామిలో భాజపా అభ్యర్థి శ్రీరాములుపై ఆధిక్యంలో కొనసాగుతుండగా, సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరి సెగ్మెంట్ నుంచి ఓటమి పాలయ్యారు. సిద్ధరామయ్యను జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ 17 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో ఓడించారు.

05/15/2018 - 11:45

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ మెజారిటీ దిశగా దూసుకు పోతున్నది. ఇప్పటికే 5 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ దాదాపు 110 కిపైగా స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 40కి పైగా స్థానాల్లో ముందంజలో దూసుకెళ్తున్నది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు గాను 222 సీట్లలో ఎన్నికలు జరిగాయి.

05/15/2018 - 02:03

న్యూఢిల్లీ, మే 14: తమ నాయకులతోపాటు ప్రతిపక్షాల నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అదుపు చేయాలని కాంగ్రెస్ నాయకులు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోదీ తమ పార్టీ అధినాయకులను అవమానిస్తున్నారు, బెదిరిస్తున్నారని వారు సోమవారం రామ్‌నాథ్ కోవింద్‌కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.

Pages