S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/15/2018 - 02:01

బెంగళూరు, మే 14: కర్నాటకలో నరాలు తెగే ఉత్కంఠకు నేటి తెరపడనుంది. 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. కర్నాటకలో గెలుపునకు అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగింది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పాయి.

05/15/2018 - 01:56

న్యూఢిల్లీ, మే 14: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ‘ఖరీదై’న ఎన్నికలుగా చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెట్టేశాయ. ఇప్పటివరకూ దేశంలో జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంత భారీఎత్తున ధన ప్రవాహం లేదని విశే్లషకులు వెల్లడిస్తున్నారు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అనే సంస్థ దిగ్భ్రాంతికరమైన అంశాలు తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

05/15/2018 - 01:54

పాట్నా, మే 14: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ప్రధాని పదవిని చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తిప్పికొట్టారు. 2019లో కూడా మోదీయే అధికారంలోకి వస్తారని, ఇప్పటికే ఆ సీటు మోదీకి రిజర్వ్ అయిపోయిందన్నారు.

05/15/2018 - 01:53

హైదరాబాద్, మే 14: కర్నాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడుతుందని, బీజేపీకి స్వల్ప ఆధిక్యం వస్తుందని పేర్కొంటున్న ఎగ్జిట్‌పోల్ ఫలితాలను కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ ‘ట్రాష్’గా కొట్టివేశారు.

05/15/2018 - 01:51

ముంబయి, మే 14: దేశ విదేశాల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిన ప్రచార ఖర్చు ఎంతని తెలిస్తే గుండె గాబరా పుట్టాల్సిదే. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వ విధానాల ప్రచారం కోసం ఇతరత్రా పబ్లిసిటీ కోసం మోదీ సర్కారు ఇప్పటి వరకూ 4,343 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని సమాచార హక్కు పిటిషన్‌కు సమాధానంగా వివరాలు వెలుగులోకి వచ్చాయి.

05/15/2018 - 01:50

జమ్మూ, మే 14: జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం రావడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నెల 19న ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నిరంతరంగా కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని, వచ్చే మూడు నాలుగు రోజులు ఇది కొనసాగుతుందని చెప్పారు.

05/15/2018 - 01:47

మంబయి, మే 14: మహారాష్టల్రో ఈ నెల 28న జరిగే రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ, ఆరు ఎంఎల్‌సి స్థానాల ఉప ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల ఎత్తులు-పొత్తులు జోరందుకున్నాయి. తమ పార్టీలకు రాజీనామాలు చేయడం, ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం, ఇతర పార్టీల్లో చేరడం వంటి రాజకీయ కప్పదాట్లు ఊపందుకున్నాయి. పలగర్, బంద్రా , గొండియా లోక్‌సభ స్థానాలకు, పాలస్-కడిగావ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

05/15/2018 - 01:46

న్యూఢిల్లీ, మే 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి రష్యాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాలోని సోచి నగరంలో జరగనున్న ఈ చర్చల్లో ఇరువురు నేతల తమ ఆలోచనా విధానాలను పంచుకోవడంతోపాటు ఇరు దేశాలకు ఉపయుక్తమైన ద్వైపాక్షిక అంశాలతో చర్చలు జరుపుతారు.

05/15/2018 - 01:45

న్యూఢిల్లీ, మే 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసిన స్మృతీ ఇరానీని సమాచార శాఖ నుంచి తొలగించి జౌళి శాఖకు పరిమితం చేశారు. ప్రధాన మంత్రి సలహా మేరకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ను ఇండిపెండెంట్ మంత్రిగా నియమించారు.

05/15/2018 - 01:38

న్యూఢిల్లీ, మే 14: ఉత్తర భారతంపై ప్రకృతి పగబట్టింది. ఐదు రాష్ట్రాల్లో ఇసుక తుపాను కల్లోలం రేపింది. ఆదివారం పిడుగుపాటుకు 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 42 మంది చనిపోయినట్టు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో ప్రచండ గాలులు బీభత్సం సృష్టించినట్టు ఓ అధికార ప్రకటనలో తెలిపారు.

Pages