S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/12/2018 - 17:14

అమరావతి: తిరుపత ఘటన అనుకోకుండా, ఆవేశంలో జరిగిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షాకు ఎందుకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు అమిత్‌షా, మోదీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ ఘటనపై సీఎం విచారణకు ఆదేశించారని అన్నారు.

05/12/2018 - 17:12

ఔరంగాబాద్: మహారాష్టల్రోని ఔరంగాబాద్‌లో నల్లా నీటి కనెక్షన్ తొలగింపు విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పెద్ద ఎత్తున హింసాకాండకు దారితీసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. అల్లరిమూకలు చెలరేగి దుకాణాలపై దాడులు చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 15మంది కానిస్టేబుళ్లు సైతం గాయపడ్డారు.

05/12/2018 - 17:11

బెంగళూరు: కర్నాటక ఎన్నికలు జరుగుతున్న వేళ మోదీ రెండు రోజుల పాటు నేపాల్ పర్యటన జరపటం పట్లకాంగ్రెస్ పార్టీ ఆక్షేపణ తెలిపింది. మోదీ నేపాల్ పర్యటనలో ముక్తినాథ్, పశుపతి ఆలయాలను దర్శించుకోవటం కర్నాటక ఓటర్లను ప్రభావితం చేయటమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. మోదీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు కాంగ్రెస్‌దేనని అన్నారు.

05/12/2018 - 15:56

బెంగళూరు : మే 17న సీఎంగా ప్రమాణం చేస్తానని యడ్యూరప్ప చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, 120 స్థానాలకు పైగా విజయం సాధిస్తామన్నారు.

05/12/2018 - 15:41

నేపాల్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. శనివారం మోదీ ముక్తినాథ్‌ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాఠ్‌మాండూ చేరుకొని అక్కడి పశుపతినాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. భారత్‌ సాయంతో నేపాల్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ సమీక్షించనున్నారు.

05/12/2018 - 13:21

బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. శిఖరిపురిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురిని ఆహ్వానిస్తానని యడ్యూరప్ప తెలిపారు.

05/12/2018 - 13:01

న్యూఢిల్లీ: ఆర్జేడీ నాయకుడు దీనా గోపేను శనివారం ఉదయం పాట్నాలో కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దీనా గోపే సతీమణి గతంలో పాట్నా డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ఓ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన హత్యకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు.

05/12/2018 - 12:56

బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రామ్‌నగరాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, ఆయన భార్య అనిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు.

05/12/2018 - 18:05

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 64శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. వీటిలో 222 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. 58,008 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

05/12/2018 - 04:30

మొహాలి, మే 11: రామాయణ కాలంలోనే శ్రీలంకకు భారత్ నుంచి చేరుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో వంతెనను శ్రీరామచంద్రుడు నిర్మించారని పంజాబ్ గవర్నర్ విపి సింగ్ బద్నోరె అన్నారు. రాముడి కాలంలోనే అత్యంత ఆధునిక ఆయుధాలను ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. జాతీయ టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మొహాలీలోని జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థ (ఎన్‌ఐపిఇఆర్)లో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

Pages