S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/07/2018 - 03:47

న్యూఢిల్లీ/ విజయవాడ, మే 6: దేశవ్యాప్తంగా 13 లక్షలమంది అభ్యర్థులు ఆదివారం జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘ఎన్‌ఈఈటీ’కి హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకోసం 2,225 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏవిధమైన అవకతవకలకు తావులేకుండా డ్రెస్‌కోడ్ విషయంలో అధికార్లు కచ్చితమైన నిబంధనలు విధించి అమలు జరిపారు.

05/06/2018 - 02:55

న్యూఢిల్లీ, మే 5: కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం లేదా ఇతర ఏ దేవాలయం లేదా మసీదును తమ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచించటం లేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శనివారం జారీచేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ విషయం తెలిపారు.

05/06/2018 - 03:48

న్యూఢిల్లీ, మే 5: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కళంకితులకు టిక్కెట్లు ఇచ్చిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతి సభలోనూ అవినీతిని నిర్మూలిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కళంకిత అభ్యర్థుల గురించి ఏం చెబుతారని ఆయన నిలదీశారు.

05/06/2018 - 02:51

తుమకూరు, మే 5: కర్నాటకలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. నేతల పరస్పర విమర్శలూ అదేస్థాయిలో సాగుతున్నాయి. శనివారం టుంకూరు ఎన్నికల సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్, జేడీ(ఎస్)లపై విరుచుకుపడ్డారు. ‘హెచ్‌డీ దేవెగౌడ పార్టీ కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా నిలిచింది’ అని ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

05/05/2018 - 14:42

లాస్‌ఏంజిల్స్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తున్న న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌కు మద్దతు తెలుపుతూ ప్రముఖ బ్రిటిష్‌ నటి, హ్యారీ పోటర్‌ ఫేమ్‌ ఎమ్మా వాట్సన్‌ ట్వీట్‌ చేశారు. ఎమ్మా వాట్సన్‌ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో మహిళా అంబాసిడర్‌గా ఉన్నారు. మహిళల సాధికారిత కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

05/05/2018 - 14:33

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ‘నమో యాప్‌’ ద్వారా ‘అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్‌ నైజం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్ల దాడికి దిగారు.ఓ వీడియోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. మీ మాటల్లో ఉన్న నిజాయతీ కర్ణాటక భాజపా అభ్యర్థుల ఎంపికలో లేదు. అవినీతిపరులైన గాలి బ్రదర్స్‌కు అత్యంత సన్నిహితులైన ఎనిమిది మందికి టికెట్లు‌ ఇచ్చారు.

05/05/2018 - 14:24

తుమకూరు: దాదాపు ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన తప్పుడు విధానాల వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులో శనివారం ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తుమకూరును స్మార్ట్‌ నగరంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధుల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

05/05/2018 - 14:02

రాంచీ : జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో 16 ఏళ్ల బాలికపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సజీవదహనం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

05/05/2018 - 14:01

సుల్తాన్‌పుర: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర‌లో పెళ్లి భోజనం చేసిన 200 మంది అతిధులు ఆస్పత్రి పాలయ్యారు. పెళ్లిభోజనం చేసిన వీరంతా గంట వ్యవధిలో వాంతులు, విరేచనాలకు గురయ్యారు. బాధితుల్లో చిన్నారులు అధికంగా ఉన్నారు. వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఆషిక్ అలి కుమారుడు గుల్షేర్‌‌కు గురువారం వివాహం జరిగింది.

05/05/2018 - 14:50

జమ్మూకాశ్మీర్ : శ్రీనగర్ చట్టాబాల్ ప్రాంతంలో ఓ ఇంట్లో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.. భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. ముందు జాగ్రత్తగా చట్టాబాల్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు పోలీసులు.

Pages