S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/17/2018 - 04:35

న్యూఢిల్లీ: ప్రజల హక్కులను పరిరక్షించడమే చట్టసభల ప్రధాన కర్తవ్యమని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన కామన్‌వెల్త్ దేశాల పార్లమెంటరీ సదస్సుకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి శాసనసభ స్పీకర్లు, మండలి చైర్మన్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

04/17/2018 - 04:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు తమ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదించే సూచనలు కనిపించటం లేదు. ఐదుగురు లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలకు సంబంధించిన ఫైలు ఇంతవరకూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదానికే వెళ్లలేదు. వైకాపా లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ నెల 6న తమ సభ్యత్వాలకు రాజీనామా చేయటం తెలిసిందే.

04/17/2018 - 04:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: మాజీ పార్లమెంటేరియన్లకు పింఛను, రవాణా భత్యాలు, పెర్క్‌ల చెల్లింపులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం ‘ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని’ స్పష్టం చేసింది. అయితే ఈ పిల్‌పై తీర్పును గత మార్చి 7న కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

04/17/2018 - 04:34

అహ్మదాబాద్: విశ్వహిందూ పరిషత్‌కు ఇటీవల స్వస్తి పలికిన ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు. హిందూత్వ ఆశయం కోసం మంగళవారం నుంచి నిరవధిక నిరసన దీక్షను చేపట్టనున్న ఆయన, ప్రధాని మోదీ తాజాగా చేపట్టిన విదేశీ పర్యటనపైనే ధ్వజమెత్తారు.

04/17/2018 - 03:40

* కోర్టుకు స్పష్టం చేసిన కతువా నిందితులు

04/17/2018 - 03:49

చిత్రం: ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జమ్మూలోని జిల్లా కోర్టు వెలుపల నినాదాలిస్తున్న స్థానికులు

04/17/2018 - 02:47

* మైనర్లపై లైంగిక దాడులకు రాహుల్ నిరసన వ్యాఖ్య

04/17/2018 - 02:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: తన తాజా విదేశీ పర్యటన ద్వారా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలకు మరింత బలాన్ని అందించగలదన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

04/16/2018 - 16:57

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ సందర్భంగా నైరుతి రుతుపవనాల ఆగమనంపై ఐఎండీ డీజీ రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. తీరం తాకిన తర్వాత నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించడానికి 45 రోజులు పడుతుందని ఆయన తెలిపారు.

04/16/2018 - 16:45

న్యూఢిల్లీ:మైనర్ బాలికలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ప్రధాని నోరు విప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. 2016లో మొత్తం 19,675 రేప్ కేసులు నమోదయ్యాయనీ... వాటిని సత్వరమే విచారించి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

Pages