S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/16/2018 - 16:24

జమ్మూ కాశ్మీర్‌: కఠువా జిల్లాలో 8 ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై కోర్టులో సోమవారం విచారణ ప్రారంభమైంది. నిందితులను కఠువాలో చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులు అందరికి చార్జిషీటు కాపీలను అందజేయాలని ప్రాసిక్యూషన్ న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

04/16/2018 - 12:56

బెంగళూరు : హాసన్‌ జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరికి రాష్ట్ర ఎన్నికల అధికారులు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. హాసన్‌కు చెందిన మంత్రి ఏ.మంజు, రోహిణిపై పలు ఆరోపణలు సంధించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు మైసూరు ప్రాంతీయ కమిషనర్‌ విచారణ చేసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదిక అందించారు.

04/16/2018 - 05:01

శ్రీనగర్: ఎనిమిదేళ్ల బాలికపై అతి దుర్మార్గంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరి శిక్షే సరైనదని, ఈ మేరకు చట్టాన్ని చేసేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.

04/16/2018 - 04:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పాకిస్తాన్‌లోని ప్రముఖ గురుద్వారాను సందర్శించడానికి వెళ్లిన సిక్కు యాత్రికులను, భారత హై కమిషనర్ కలుసుకోకుండా, ఆ దేశం అడ్డుకోవడంపై భారత్ తీవ్ర ఆక్షేపణ తెలిపింది. మన విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, 1800 మంది సిక్కు యాత్రికులు ఏప్రిల్ 12 నుంచి పాకిస్తాన్‌లో మతపరమైన తీర్థయాత్రలు చేస్తున్నారు.

04/16/2018 - 04:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: జమ్ము-కాశ్మీర్ సమస్యకు ఉగ్రవాదం పరిష్కారం కాదని, రక్తపాతం ఏ సమస్యనూ పరిష్కరించలేదని ఆ దిశగా అడుగులు వేస్తున్న యువత త్వరలోనే తెలుసుకుంటారని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. మిలిటెన్సీతో ఏ సమస్యా పరిష్కారం కాదు.. వారి ఆశలు నెరవేరాలంటే కేవలం శాంతియుత సహజీవనమే పరిష్కారమని ఆయన అన్నారు.

04/16/2018 - 04:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశ చరిత్రను పూర్తిగా తిరగరాయాల్సి న అవసరం లేదని, కొన్నిచోట్ల ‘అవసరమైన దానికంటే అతిగా’ చూపిన అంశాలను సవరిస్తే సరిపోతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్) ఛైర్మన్ అరవింద్ జమ్‌ఖేద్కర్ పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ (హెచ్‌ఆర్‌డి) కింద ఐసీహెచ్‌ఆర్ పనిచేస్తుంది.

04/16/2018 - 04:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 23 నుంచి దేశవ్యాప్తంగా ‘రాజ్యాంగ పరిరక్షణ’ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. రాజ్యాం గం, దళిత సమాజంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా దళితులు, అణగారిన వర్గాల చేరువకు పార్టీని తీసుకెళ్లడమే రాహు ల్ ప్రధాన లక్ష్యం.

04/16/2018 - 04:24

ముంబయి, ఏప్రిల్ 15: పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాడీ శాఖకు సంబంధించిన చట్టబద్ధమైన ఆడిటర్లు, క్రమశిక్షణా సంఘం ముందుకు హాజరు కావాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్స్ ఇండియా (ఐసీఏఐ) నోటీసులు జారీచేసింది. 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాడీ శాఖకు ఆడిటర్లుగా పనిచేసిన వారి జాబితాను ఐసీఏఐ రూపొందించింది.

04/16/2018 - 04:17

శ్రీనగర్, ఏప్రిల్ 15: కథువాలో 8 ఏళ్ల ముస్లిం బాలిక అత్యాచారం, హత్య కేసు లో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పా ల్గొన్న ఇద్దరు వివాదాస్పద భాజపా మం త్రుల రాజీనామాను జమ్ము-కశ్మీర్ ము ఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆమోదించారు. మంత్రులు లాల్ సింగ్, ఛందర్ ప్రకాశ్ గంగలు సమర్పించిన రాజీనామాలను, తక్షణమే ఆమోదించిన మెహబూబా ముఫ్తీ, గవర్నర్‌కు పంపారు.

04/16/2018 - 04:16

బెంగళూరు, ఏప్రిల్ 15: కర్ణాటకలో ఎన్నికల ప్రచార కార్యక్రమం వ్యక్తిగత దూ షణలతో మరింతగా దిగజారిపోతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రానికి వచ్చినప్పుడు చెప్పులతో కొట్టండి అంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు ప్రజలకు పిలుపునివ్వడంతో పెద్ద దుమారమే రేగింది.

Pages