S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/16/2018 - 01:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోయిందా? అవుననే అంటోంది కేంద్ర హోంశాఖ. అంతేకాదు, దేశవ్యాప్తంగా 44 జిల్లాలను నక్సల్స్ ప్రభావిత జిల్లాల జాబితా నుంచి కేంద్ర హోంశాఖ తొలగించింది. దేశంలోని పది రాష్ట్రాల్లో గల 106 జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉన్నట్టు కేంద్ర హోం శాఖ గతంలో గుర్తించింది. తరువాత ఆయా రాష్ట్రాలు జిల్లాలను విభజించడం వల్ల ఆ సంఖ్య 126కు పెరిగింది.

04/15/2018 - 05:57

వౌ (మధ్యప్రదేశ్), ఏప్రిల్ 14: విచ్ఛిన్నకర శక్తుల కుత్సితాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం సమగ్ర అభివృద్ధితో ముందుకు సాగాలంటే సంఘర్షణల స్థానే సామరస్యపూరక వాతావరణం పెంపొందాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయం తి సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రాష్టప్రతి ఉద్ఘాటించారు.

04/15/2018 - 05:58

జనగళ (బీజాపూర్), ఏప్రిల్ 14: వెనుకబడిన వర్గాలు, పేదల్లో చైతన్యా న్ని తీసుకొచ్చి వారికున్న రాజ్యాంగ హ క్కులపై లోతైన అవగాహన కల్పించిన ఘతన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ స్ప ష్టం చేశారు. తాను అట్టడుగు స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదగడం కూడా అంబేద్కర్ స్ఫూర్తి, చలవేనని మోదీ అన్నారు.

04/15/2018 - 05:45

లక్నో, ఏప్రిల్ 14: దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టిస్తున్న ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగార్‌ను ఏడురోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ లక్నో కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఇంతకుముందు కోర్టుకు హాజరయ్యేముందు మాట్లాడిన కుల్‌దీప్‌సింగ్ తనకు న్యాయవ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం ఉందని అన్నారు.

04/15/2018 - 05:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌పై పగ పట్టారని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు పి.రవీంద్రబాబు ఆరోపించారు. శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి నెరవేర్చలేదు సరికదా తెలుగుదేశం ఎంపీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించినా స్పందించటం లేదంటూ ధ్వజమెత్తారు.

04/15/2018 - 05:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఘనమైన వారసత్వాన్ని బీజేపీ నిరుగారుస్తోందని, దళితులు ఇతర వెనకబడిన వర్గాలను ఆదుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటలకే పరిమితమవుతున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

04/15/2018 - 05:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశంలో మైనారిటీ వర్గాలే ఎక్కువ హక్కులను అనుభవిస్తున్నారని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మైనారిటీలు ఎక్కువ సదుపాయాలు పొం దుతున్నారు. మెజారిటీకేమీ అందడం లేదు’ అంటూ శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

04/15/2018 - 05:11

చిత్రం: జనంతో మమేకం కావడం అన్నది మోదీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు... ముఖ్యంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితులను ఆకట్టుకోవడానికి పోటాపోటీగా కార్యక్రమాలు జరిగాయ. ఇందులో భాగంగా చత్తీస్‌గఢ్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఓ గిరిజన మహిళకు పాదుకలను వేసుకోవడంలో సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

04/15/2018 - 05:13

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న కామెనె్వల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతున్నది. శనివారం ఒక్కరోజే ఎనిమిది స్వర్ణాలు, ఐదు రజతాలు, మరో నాలుగు కాంస్యాలను అందుకొని, పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నది. లెజెండరీ మహిళా బాక్సర్ మేరీ కోమ్ తొలిసారి కామనె్వల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టి, స్వర్ణ పతకాన్ని సాధించింది.

04/15/2018 - 05:14

* హిందుత్వ పరిరక్షణకు మంగళవారం నుంచి ఆమరణ దీక్ష

Pages