S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/21/2016 - 14:35

దిల్లీ: జమ్ము-కాశ్మీర్‌లో అల్లర్లను పాకిస్తాన్ ప్రేరేపిస్తూ, అమాయక యువతను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. కాశ్మీర్‌లో హింసాత్మక పరిస్థితులపై గురువారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన దేశానికి కిరీటంలా నిలిచే కాశ్మీర్‌లో విధ్వంసానికి పాక్ కుట్ర పన్నుతోందన్నారు. దేశంలో ఉగ్రవాదులను సమర్ధించేవారి సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

07/21/2016 - 14:34

దిల్లీ: ఎపిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, ఆ ప్రాజెక్టును అనుకున్న సమయానికి తామే పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ జాతీయ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంకా పూర్తి చేస్తామన్నారు. తెలుగురాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే ఎపెక్స్ కమిటీని నియమిస్తామన్నారు.

07/21/2016 - 12:41

లక్నో: తమ పార్టీ అధినేత్రి మాయావతిపై బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బిఎస్‌పి కార్యకర్తలు యుపిలో గురువారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దళిత మహిళను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన దయాశంకర్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. బిఎస్‌పి ఆందోళనల నేపథ్యంలో పలు చోట్ల పోలీసులు భారీగా మోహరించారు.

07/21/2016 - 11:36

అమృత్‌సర్‌: దుబాయ్‌ నుంచి గురువారం అమృత్‌సర్‌ చేరుకున్న స్పైస్‌జెట్‌ విమానంలో అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. అమృత్‌సర్‌ చేరుకోగానే విమానంలో తనిఖీలు చేపట్టారు.

07/21/2016 - 11:33

ముంబయి: నేడు ఉదయం స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 20 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 10 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు కోల్పోయి రూ.67.25 పైసల వద్ద నమోదైంది.

07/21/2016 - 07:15

న్యూఢిల్లీ, జూలై 20: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్ చేరికపై చైనాతో ఉన్న విభేదాలను తొలగించుకునేందుకు ఆ దేశంతో చర్చలు జరుపుతున్నట్టు భారత్ బుధవారం ప్రకటించింది. అయితే భారత్ ఎప్పటికీ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయబోదని ప్రభు త్వం స్పష్టం చేసింది.

07/21/2016 - 07:13

న్యూఢిల్లీ, జూలై 20: నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను అస్థిరపరుస్తోందని, సమాజాన్ని చీలుస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తన సంకుచిత సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దడానికి పార్లమెంటులో ఉన్న ఆధిక్యతను లైసెన్సుగా భావిస్తోందని, అది తప్పుడు భావన అని ఆమె ధ్వజమెత్తారు.

07/21/2016 - 07:13

ఇటానగర్, జూలై 20: అరుణాల్‌ప్రదేశ్‌లో నాలుగు రోజుల క్రితం గద్దెనెక్కిన పేమా ఖండూ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది. దీంతో కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రం గాడిలో పడినట్లయింది. ముఖ్యమంత్రి ఖండూకు మద్దతు తెలియజేసే తీర్మానానికి 46 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, ప్రతిపక్ష బిజెపికి చెందిన 11 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.

07/21/2016 - 07:11

రాజ్‌కోట్, జూలై 20: గుజరాత్‌లోని ఉనా పట్టణంలో దళిత యువకులను చితకబాదిన సంఘటనకు నిరసనగా బుధవారం దళిత సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు, రాళ్లురువ్విన సంఘటనలు జరిగాయి. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ బుధవారం బాధితుల కుటుంబ సభ్యులను కలిశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఉనాకు క్యూ కడుతున్నారు.

07/21/2016 - 07:11

మావు/న్యూఢిల్లీ, జూలై 20: బిఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యా ఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్‌పై పార్టీ వేటు వేసింది. మాయావతిపై సింగ్ చేసిన వ్యాఖ్యలను అన్ని పార్టీల నేతలు తీవ్రంగా ఖండించడమే కాక ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంతో బిజెపి అదిష్ఠానం సైతం ఇరుకున పడింది.

Pages