S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/13/2018 - 03:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కాంగ్రెస్ దురుద్దేశ్యపూర్వకంగా స్తంభింపజేసిందని ఆరోపిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు గురువారం నిరసన నిరాహార దీక్షలు చేశారు. నరేంద్ర మోదీ తన విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఒక రోజంతా నిరాహార దీక్ష కొనసాగించారు.

04/13/2018 - 03:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గుర్బానీ మీడి యా (ప్రై) లిమిటెడ్ నిర్మించిన ‘నానక్ షా ఫకీర్’ విడుదలను ఆపాలని శిరోమణి గు రుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) గురువారం సుప్రీంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సిక్కుల తొలి గురువుగురునానక్ బోధనల ఇతివృత్తంగా సర్తాజ్‌సింగ్ పన్ను దర్శకత్వంలో నిర్మించి శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

04/13/2018 - 04:18

లక్నో/ముంబయి, ఏప్రిల్ 12: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ ఘటన ఘటన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగార్‌పై ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్ నమోదయింది. 16 ఏళ్ల బాలికపై జరిగిన ఈ దారుణానికి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేను తక్షణం అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

04/13/2018 - 02:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఎస్సీ,ఎస్టీ చట్టం విషయంలో ఇటీవల వెలువరించిన తీర్పు అందులో నిబంధనలను నీరుగార్చిదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. దీని వల్ల దేశానికి ఎంతో నష్టం జరిగిందని, దీన్ని సరిదిద్దేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని నివేదించింది. ఈ సునిశిత అంశంపై సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా అలజడి చెలరేగిందని, సామరస్యమూ దెబ్బతిందని తెలిపింది.

04/13/2018 - 03:14

చెన్నై, ఏప్రిల్ 12: నిధుల పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేంద్రం నుంచి అందే నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని తగ్గంచేందుకు ఆయన యత్నించారు. ఇక్కడ అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వం సహకార సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.

04/12/2018 - 03:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: చమురు ధరలను కృత్రిమంగా పెంచడం స్వీయ వినాశనానికి దారితీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ జరుగుతున్న 16వ అంతర్జాతీయ ఇంధన ఫోరం మంత్రుల (ఒపెక్ దేశాల) సమావేశాన్నుద్దేశించి ఆయన ప్రసంగించారు. బాధ్యతాయుతంగా, హేతుబద్ధమైన రీతిలో చమురు రేట్లను నిర్ణయించడం వల్ల అందరికీ ఇంధనం అందుబాటులోకి వస్తుందన్నారు.

04/12/2018 - 03:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: నిజమైన విద్య శీలము, సామర్థ్యం, ప్రమాణము, ప్రవర్తనను పెంచేదిగా ఉండాలని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్బోధించారు. వెంకయ్య నాయుడు బుధవారం నోయిడాలోని బిర్లా ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ సంస్థ స్నాతకోత్సవంలో ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. యువ మానవ వనరులే మన దేశానికి అత్యంత ముఖ్యమైన సంపద అని ఆయన ఉద్ఘాటించారు.

04/12/2018 - 03:13

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణానదీ జలాలను తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకుగాను జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు ప్రారంభమయ్యాయి. ఏపీ తరపు సాక్షిగా ఉన్న వ్యవసాయ రంగ నిపుణుడు పీవీ సత్యనారాయణను తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామిషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలిక పంటలే వేస్తున్నారా లేక స్వల్పకాలిక పంటలపై దృష్టి సారించారా?

04/12/2018 - 03:28

శ్రీనగర్, ఏప్రిల్ 11: కశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాను మరో నలుగురు సాధారణ పౌరులు మృతి చెందగా, ముగ్గురు ఉగ్రవాద ముష్కరులు తప్పించుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఖుద్వానీ ప్రాంతంలోని ఒక ఇంటిలో లష్కరే తోయ్‌బాకు చెందిన ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు, గత రాత్రి 10 గంటల సమయంలో, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

04/12/2018 - 02:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: మొఘల్ చక్రవర్తి షాజహాన్ సంతకంతో కూడిన పత్రాలను చూపించాలని సుప్రీంకోర్టు సున్నీ వక్ఫ్‌బోర్డును ఆదేశించింది. తాజ్‌మహల్ తమదేనని, 1631లో షాజహాన్ ‘వక్ఫ్‌నామా’ ద్వారా తమకు దాన్ని ఆధీనం చేశాడని, సున్నీ వక్ఫ్‌బోర్డు వాదిస్తోంది.

Pages