S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/12/2018 - 02:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ధర్మాసనాలు ఏర్పాటు, కేసులు కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి సర్వహక్కులూ ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘సమానుల్లో ప్రథములు’అంటూ విస్పష్టంగా తెలిపింది.

04/12/2018 - 02:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో సతమతమవుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచవద్దని పెట్రోలియం కంపెనీలను ఆదేశించినట్లు తెలిసింది. కర్నాటక శాసనసభ ఎన్నికలు మే 12న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే బీజేపీ విజయావకాశాలు దెబ్బతింటాయని ఎన్డీయే ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

04/12/2018 - 02:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం సహా విభజన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు బుధవారం భగ్నం చేశారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఢిల్లీ పోలీసులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించారు.

04/12/2018 - 02:08

చండీగఢ్, ఏప్రిల్ 11: దేశ వ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే చేటని హెచ్చరించారు. పంజాబ్ వర్శిటీలో ఎస్‌బి రంగ్నేగర్ స్మారకోపన్యాసంలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దళితులు, మైనారిటీలపై దాడులు స్వేచ్ఛ, అభివృద్ధికి విఘాతమేనన్నారు. ‘మతం, కులం, ప్రాంతీయ, భాష ప్రాతిపదికన విద్వేషాలు పెరిగిపోయాయి.

04/12/2018 - 02:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణపై అధ్యయనానికి కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నియమితులయ్యారు. కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 55వ కౌన్సిల్ సమావేశం జరిగింది.

04/12/2018 - 00:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు డిక్లరేషన్ దాఖలు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను డిల్లీ కోర్టు బుధవారం తిరస్కరించింది. ‘దీనికి సంబంధించి ఫిర్యాదుదారు సోషలిస్ట్‌పార్టీ (ఇండియా) ఢిల్లీ ప్రదేశ్‌కు చెందిన రేణు గంభీర్ పలుమార్లు కోర్టుకు హాజరు కాలేదు. ఆమెకు ఈ కేసుపై పెద్దగా ఆసక్తి ఉన్నట్టు లేదు.

04/12/2018 - 01:09

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవో గ్యాంగ్‌రేప్ కేసు సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్‌ను వచ్చేవారం సుప్రీం కోర్టు విచారించనుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే మరణించిన సం ఘటన సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని అధికార బీజేపీ పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది.

04/12/2018 - 00:46

చెన్నై, ఏప్రిల్ 11: రాష్ట్రాలకు నిధుల పంపిణీలో 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను మళ్లీ రూ పొందించాలంటున్న దక్షిణాది రాష్ట్రాలతో తాజాగా తమిళనాడు సైతం గొంతు కలిపింది. 2011 జనాభా ప్రాతిపదికన నిధుల పంపిణీ జరిపితే రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్న ఏపీ, కర్నాటక, కేరళ, పాండిచ్చేరిల వాదనను పరోక్షంగా తమిళనాడు సమర్థించింది.

04/12/2018 - 00:44

అలహాబాద్, ఏప్రిల్ 11: యూపీలో ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ బాధితురాలి తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించవద్దని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. 18 ఏళ్ల బాధితురాలి తండ్రి మంగళవారం నాడు పోలీసు కస్టడీలో మృతి చెందిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగార్, అత డి సోదరుడు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ‘బాధితురాలి తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు పూ ర్తిచేయకపోతే అలా ఉంచండి.

04/12/2018 - 00:40

ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్ని ప్రధాని పదవిని కోల్పోయిన నవాజ్ షరీఫ్‌కు జైలు భయం పట్టుకుంది. అడియాల జైలు తన కోసం సి ద్ధం చేస్తున్నారని బుధవారం ఇక్కడ ఆరోపించారు. రాజకీ య దురుద్దేశంతోనే జాయింట్ ఇన్విస్టిగేషన్ టీమ్ (జేఐటీ) ఏర్పాటైందని, తనను ఎలాగానే జైలుకు పంపాలన్న దురుద్దేశంతోనే దర్యాప్తు సాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Pages