S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/12/2018 - 00:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే మనీలాండరింగ్‌ను నివారించడంలో ఆధార్‌కార్డు ఏవిధంగా ఉపయోగపడుతుం దో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిం ది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీ పక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యా యమూర్తులతో కూడిన ధర్మాసనం ఆధార్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై బుధవా రం విచారించింది.

04/11/2018 - 04:14

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీకి అత్యంత కీలకంగా మారిన కర్నాటక శాసనసభ ఎన్నికల కో సం ఎందుకు ప్రచారం చేయడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల స మయంలో ముందుండి పార్టీ తరఫున ప్ర చారం చేసే మోదీ కర్నాటక విషయంలో ఎందుకు వెనకబడిపోయారనేది అర్థం కా వడం లేదు. కర్నాటక శాసనసభ ఎన్నికలు మే 12న జరగనున్న విషయం తెలిసిందే.

04/11/2018 - 02:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: గత సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన భారతీయ జనాతా పార్టీ ఆదాయం అదే స్థాయిలో పెరిగింది. 2015-16, 2016-17 లో ఈ పార్టీ ఆదాయం 81.18 శాతానికి చే రింది. అయితే అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆదాయం 14 శాతానికి పడిపోయింది.

04/11/2018 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: లోక్‌పాల్ నియామకానికి సంబంధించి మంగళవారం జరిగిన ఎంపిక కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ రెండోసారీ బహిష్కరించింది. ఇందుకు కార ణం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ను మాత్రమే ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం. ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఖర్గే, ప్రధాని మోదీకి లేఖ రాశారు.

04/11/2018 - 02:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఆధార్ లింక్ పేరుతో సీనియర్ సిటిజన్ల పెన్షన్ నిలిపివేయడాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆధార్ నంబర్‌ను సాకుగా చూపి వయోవృద్ధులను ఇబ్బందుల పాలుచేయడంపై సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు మండిపడ్డారు. అహ్మద్‌నగర్‌కు చెందిన నిర్మల నిషికాంత్ ధుమ్నే చేసిన ఫిర్యాదును కమిషన్ మంగళవారం విచారించింది.

04/11/2018 - 02:47

చిత్రాలు..హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో మరణించిన పిల్లలకు సామూహిక దహన సంస్కారాలు నిర్వహిస్తున్న బంధువులు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.

04/11/2018 - 02:43

తిరువనంతపురం, ఏప్రిల్ 10: రాష్ట్రాలకు నిధుల పంపిణీ విషయం లో 15వ ఆర్థిక కమిషన్ పరిశీలనాంశాలను మళ్లీ రూపొందించాలని కేర ళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి ప్రభుత్వాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. రాజ్యాంగంలో ప్రవచించిన సమాఖ్య స్ఫూర్తికి ప్రస్తుత విధి వి ధానాలు విఘాతకరంగా ఉన్నాయని, ఈ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మం త్రులు స్పష్టం చేశారు.

04/11/2018 - 02:43

మాధేపుర, ఏప్రిల్ 10: బిహార్‌లో తొలి హైపవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజండా ఊపారు. 12,000 హార్స్‌పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటీవ్ మాధేపురలో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టును భారతీయ రైల్వేలు, ఫ్రెంచ్ కంపెనీ అల్‌స్రోమ్ సంయుక్తంగా చేపట్టాయి. బిహార్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. చంపారన్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించారు.

04/11/2018 - 02:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఐఏఎస్ ప్రేమ జంట టీనాడాబీ, అమీర్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. టీనాడాబీ, అతార్ అమీర్ ఉల్ షాఫీ జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గావ్‌లో ఓ ఇంటివారయ్యారు. టీ నా, అమీర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు. ‘మీ ప్రేమ వివాహం స్ఫూర్తిదాయకం. కలకాలం వర్థిల్లాలి’ అంటూ ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

04/11/2018 - 02:36

న్యూఢిల్లీ/లక్నో, ఏప్రిల్ 10: ఉన్నావ్ జిల్లాలో చోటుచేసుకున్న సా మూహిక అత్యాచారం, కస్టోడియల్ డెత్ ఘటనలపై మానవ హక్కు ల సంఘం స్పందించింది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేపై బాధిత మహిళ ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే ఆమె తండ్రి పోలీస్ కస్టడీలో మృతిచెందిన కేసుకు సంబంధించి పూ ర్తి వివరాలతో నివేదిక అందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీలను ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశించింది.

Pages