S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/11/2018 - 02:12

సూళ్లూరుపేట, ఏప్రిల్ 10: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో క్షేత్రీయ దిక్సూచి (ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం) ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ప్రయోగం జరగనుంది.

04/11/2018 - 02:02

ఉత్తరప్రదేశ్‌తో ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయ. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ధ్వంసమైన విగ్రహం స్థానే మంగళవారం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయతే బాబా సాహెబ్ కోటుకు కాషాయ రంగు వేయడం వివాదాస్పదంగా మారింది.

04/11/2018 - 04:11

ముంబయి/సిమ్‌డెగా(జార్ఖండ్): దేశంలోని రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదారులు నెత్తురోడాయి. 27 మంది దుర్మరణం పాలయ్యారు. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ప్రమాదానికి ట్రక్కు బోల్తాకారణం కాగా, మరో ప్రమాదానికి బస్సు పల్టీ కొట్టడం కారణం. రెండు సంఘటనలు దాదాపు తెల్లవారు జామునే జరగడం గమనార్హం. డ్రైవర్లు స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదాలు సంభవించాయని పోలీసులు తెలిపారు.

04/11/2018 - 04:12

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసేందుకు కొన్ని జిల్లాలను పరిపుష్టి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖ, వారణాశి, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని మొదటి దశలో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఎంపిక చేసింది. మంగళవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.

04/11/2018 - 01:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి ఐదో రోజుకు చేరుకుంది. పార్లమెంట్ వాయిదా పడిన అనంతరం ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆంధ్రా భవన్‌లో శుక్రవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టిన విషయం విదితమే. అయితే దీక్షలో ఉన్న మిథున్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి శుక్రవారం బాగా నీరసించిపోయారు.

04/11/2018 - 01:10

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 10: జాతీయ రక్షణ దళంతో దేశ భద్రత మరింత పటిష్టమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పునరుద్ఘాటించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వినోభానగర్‌లోని దేశ రక్షణ దళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్-ఎన్‌ఎస్‌జీ) 28 స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ (ఎస్సీజీ) కాంప్లెక్స్‌ను మంగళవారం ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎన్‌ఎస్‌జీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

04/11/2018 - 01:04

మోతీహరి, ఏప్రిల్ 10: దేశాభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఎన్‌డీఏ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే విపక్షాలు అవి అమలుకాకుండా ప్రతిబంధకంగా మారాయని మంగళవారం బిహార్‌లో జరిగిన ఓ సభలో విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అసాంఘిక శక్తులపై పోరాడుతున్నారని మోదీ ప్రశంసించారు.

04/10/2018 - 16:39

పెహల్గామ్: 2015 సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో టాప్ ర్యాంక్ సాధించిన 24 ఏళ్ల దళిత అమ్మాయి టీనా దాబి, అదే ఏడాది రెండవ ర్యాంక్ సాధించిన అత్తర్ అమిర్ ఉల్ షఫిలు కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ కొత్త దంపతులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంగ్రాట్స్ చెప్పారు. అసహనం పెరుగుతున్న ఈ రోజుల్లో మీ కలయిక భారతీయులకు ఆదర్శంగా నిలువాలని ఆశిస్తున్నట్లు రాహుల్ ట్వీట్ చేశారు.

04/10/2018 - 16:15

మోతీహరి: చంపారన్‌లో సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..తన ప్రభుత్వం అమలుచేస్తున్న స్వచ్ఛ్భారత్ ఉద్యమానికి ఇది ఒక గొప్ప పండుగ అని అన్నారు. ఈ ఉద్యమాన్ని సత్యాగ్రహం నుంచి స్వచ్ఛాగ్రహంగా అభివర్ణించారు.

04/10/2018 - 16:13

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వియాదవ్‌లను సీబీఐ ప్రశ్నించింది. రైల్వే హోటళ్ల టెండర్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మంగళవారంనాడు రబ్రీదేవి ఇంటిలో సోదాలు నిర్వహించింది.

Pages