S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/04/2018 - 12:38

న్యూఢిల్లీ : దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆయా పార్టీల సభ్యులను ఉద్దేశించి చైర్మన్ వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వెంకయ్య ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని సభ్యులు నడుచుకోవాలని ఆయన సూచించారు.

04/04/2018 - 12:33

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. పార్లమెంటు ఉభయసభలు ప్రారంభానికి ముందు గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేతబూని ఆందోళనలో పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ దోబీ వేషధారణలో ఆందోళనలో పాల్గొన్నారు.

04/04/2018 - 12:31

శాన్‌ ఫ్రాన్సిస్కో: యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో ఓ మహిళ అనూహ్యంగా కాల్పులకు తెగబడి బీభత్సం సృష్టించింది. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో యూట్యూబ్ ప్రధాన కార్యాలయం ఉంది. లంచ్ సమయంలో ఉద్యోగులు భోజనం చేస్తుండగా ఓ మహిళ డైనింగ్ కోర్టుయార్డు వైపు దూసుకొచ్చింది. కార్యాలయం లోపలికి వెళ్తూ విచక్షణా రహితంగా కాల్పులు మొదలు పెట్టింది. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయింది.

04/04/2018 - 12:27

రాంచీ : జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెరెన్‌దాగ్ అటవీప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు మూడు ఏకే 47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

04/04/2018 - 02:00

దేశంలో పెట్రోలు ధరలు అదుపు లేకుండా పెరిగిపోతున్నందుకు నిరసనగా మంగళవారం థానేలో ఎన్సీపీ కార్యకర్తలు వినూత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తోపుడుబండిపై మోటారు బైకు డ్రైవ్ చేస్తున్న మహిళను కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

04/04/2018 - 01:56

జైపూర్/్భపాల్, ఏప్రిల్ 3: సోమవారం కొన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు నిరసనగా మంగళవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్‌లో ఐదువేలమంది, సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెట్టారు. వీరిద్దరూ దళితులే కావడం విశేషం. కాగా మధ్యప్రదేశ్‌లో నిన్న అల్లర్లలో గాయపడిన వారిలో మరో ఇద్దరు మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 11కు చేరింది.

04/04/2018 - 01:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలతో కలిసి పని చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీ ఎంపీలతో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎవరెవరితో చర్చలు జరపాలనే అంశంపై చర్చించారు.

04/04/2018 - 01:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వైకాపా పన్నిన రాజకీయ ఉచ్చుల్లో చిక్కుకున్న తెలుగుదేశం తమ పార్టీపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు హరిబాబు, ఎంపీలు గోకరాజు గంగరాజు, జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈ ముగ్గురూ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ- వైకాపాకు బీజేపీ చేరువ అవుతోందంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

04/04/2018 - 01:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: భారత్‌తో 1971లో జరిగిన యుద్ధంలో పరాభవాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ ఆ ఓటమి ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదని, భారత్‌లో అస్థిరత, విభజనకు అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉందని సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్) డైరక్టర్ జనరల్ కేకే శర్మ అన్నారు.

04/04/2018 - 04:01

మంగళవారం పార్లమెంట్ హౌస్‌లో ఓ ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఉభయ సభల్లోనూ దుమారం రేగుతుంటే ఈ మూడు పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు ఇలా ఆత్మీయానుబంధాన్ని రాజకీయాలకు అతీతంగా చాటుకున్నారు. సుప్రియా సూలే (ఎన్సీపీ), రంజీత్ రంజన్ (కాంగ్రెస్), సంతోష్ అహ్లావత్ (బీజేపీ)ల మధ్య చోటుచేసుకున్న ఈ అనుబంధం అందర్నీ ఆకర్షించింది.

Pages