S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/03/2018 - 13:00

న్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో సవరణలు చేస్తూ ఇచ్చిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మధ్యాహ్నం 2 గంటలకు ఓపెన్ కోర్టులో దీనిపై విచారణ చేపట్టనున్నారు.

04/03/2018 - 12:52

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో నిన్నటి పరిస్థితులే పునరావృతమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ఆర్డర్‌లో లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. లోక్‌సభలో అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేయడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్.

04/03/2018 - 12:31

న్యూఢిల్లీ: రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ సహా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారితో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు.

04/03/2018 - 12:24

న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌ 17 హెలికాప్టర్‌ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ సమీపంలో కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పైలట్‌ సహా హెలికాప్టర్‌లో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కేదార్‌నాథ్‌ సమీపంలోని హెలిప్యాడ్‌లో మిగ్‌ 17ను ల్యాండ్‌ చేస్తుండగా ఐరన్‌ గిడ్డర్‌కు తగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

04/03/2018 - 05:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఇటీవల కాలంలో జరిగిన పశ్నాపత్రాల లీక్‌ల వ్యవహారంలో అప్రతిష్ట మూటగట్టుకున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) భవిష్యత్‌లో మళ్లీ అటువంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టింది. లీక్ అవడానికి ఏమాత్రం అవకాశం లేని ఒక కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. సోమవారంనాడు ఢిల్లీలో ఈ మేరకు ఓ ప్రయత్నం చేసింది.

04/03/2018 - 05:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) అమలు కోసం రాష్ట్రాలు తమ స్వంతం బీమా కంపెనీలను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఒకవైపు రాష్ట్రాలనుంచి వేర్వేరు సందర్భాల్లో అందిన అభ్యర్థనలు, మరోవైపు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)-2017 నివేదికను పరిశీలించిన కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

04/03/2018 - 05:27

లండన్, ఏప్రిల్ 2: వాతావరణ మార్పుల కారణంగా వచ్చే విపరీత పరిణామాల ఫలితంగా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే దేశాల్లో భారత్ ఒకటని ఒక ప్రపంచస్థాయి పరిశోధన హెచ్చరించింది. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటెర్‌కు శాస్తవ్రేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు.

04/03/2018 - 05:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: సీబీఎస్‌ఈ పనె్నండు, పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్‌కు సంబంధించి నాలుగు వారాల్లో సవివర నివేదిక ఇవ్వాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ, సీబిఎస్‌ఈ బోర్డు, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. ఇలాంటి లీకులు ప్రభుత్వ వ్యవస్థల పట్ల విద్యార్థులకు నమ్మకం కోల్పోయే పరిస్థితి తెస్తుందని ఎన్‌హెచ్‌ఆర్‌సి అభిప్రాయపడింది.

04/03/2018 - 04:25

అమృత్‌సర్/కోల్‌కతా/పాట్నా, ఏప్రిల్ 2: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన 38 మంది భారతీయుల మృత దేహాలను సోమవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. తర్వాత వాటిని అమృత్‌సర్, కోల్‌కతా, పాట్నాల్లోని వారి బంధువులు లేదా స్థానిక అధికార్లకు అప్పగించారు. బాగ్దాద్ నుంచి ఈ మృతదేహాల అవశేషాలను విదేశాంగశాఖ సహాయమంత్రి వి.కె.సింగ్ బాగ్దాద్‌నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.

04/03/2018 - 04:09

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: షెడ్యూలు కులాలు, తెగల చట్టంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో నిరసనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో అసలు వాస్తవ పరిస్థితి ఏమిటి? నిజంగా ఈ చట్టాన్ని ప్రభుత్వ అధికారులను వేధించడానికి ఆయుధంగా వాడుతున్నారా లేక తాజా సవరణ ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారి హక్కులను కాలరాయడానికి సంకల్పించిందా?

Pages