S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/02/2018 - 01:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాల లీక్ వ్యవహారం ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్న నేపథ్యంలో కేంద్ర జనశక్తి వనరుల మంత్రిత్వశాఖ బోర్డు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ లీక్ వ్యవహారంలో మరో ముగ్గురిని అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు ఓ ప్రైవేటు స్కూల్ టీచర్లు కావడం గమనార్హం. పరీక్ష పత్రాల లీక్ వ్యవహారంతో వీరికి సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో ఈ అరెస్టులు చేసింది.

04/02/2018 - 03:56

న్యూఢిల్లీ: నిన్నమొన్నటి వరకూ కావేరీ అంశంపై పార్లమెంట్‌లో నిరసన తెలిపిన అన్నాడీఎంకె, ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనకు పదును పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికే పక్షంలో ఎన్డీయే సర్కారుపై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని అన్నాడీఎంకె నాయకుడు తంబిదురై తెలిపారు.

04/02/2018 - 00:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంపై తెలుగుదేశం, వైకాపాతోపాటు ఇతర ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు సోమవారం కూడా చర్చకు రాకపోవచ్చు. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, వైకాపా సభ్యుడు సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డితోపాటు కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతకు పంపించారు.

04/02/2018 - 00:34

సూళ్లూరుపేట, ఏప్రిల్ 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు (ఇస్రో) కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగాల్లో మరోసారి పెద్ద షాక్ తగిలింది. షార్ కేంద్రం నుంచి మార్చి 29న ప్రయోగించిన అధునాతన ఉపగ్రహం జీశాట్-6ఏను జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

04/02/2018 - 01:03

శ్రీనగర్, ఏప్రిల్ 1: కశ్మీర్‌లో విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ కశ్మీర్‌లో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 12మంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. షోఫియాన్‌లో గత ఏడాది లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితులను ఈ ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి.

04/01/2018 - 04:01

న్యూఢిల్లీ, మార్చి 31: కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యంత విస్తృత స్థాయిలో ప్రచార యుద్ధా న్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు.

04/01/2018 - 04:20

మైసూర్, మార్చి 31: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక అధికార పీఠం నుంచి ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తొలగించే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మే 12న జరిగే ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ని గద్దె దించాలని ఇప్పటికే ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారని అమిత్ షా తెలిపారు.

04/01/2018 - 03:10

న్యూఢిల్లీ,మార్చ్ 31:్భరత, చైనాల మధ్య మరోసారి డోక్లాం పునరావృతం అవుతోందా? భారత, చైనా, భూటాన్ ట్రై జంక్షన్‌లో ఉన్న డోక్లాం పరిసర ప్రాంతాల్లో ఇరుదేశాల సైనిక మొహరింపు మరోసారి పుంజుకోవటంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

03/31/2018 - 16:44

జమ్మూ : వైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. భారీ స్థాయిలో భక్తులు పోటెత్తడంతో ఆ యాత్రకు బ్రేకేశారు. కట్రా బేస్ నుంచి వస్తున్న భక్తులను ప్రస్తుతానికి నిలిపేసినట్లు సమాచారం. భక్తుల తాకిడి అధికంగా ఉందని, నిన్న రాత్రి 8 గంటలకు టికెట్ కౌంటర్‌ను మూయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మాతా వైష్ణో దేవి దర్శనం కోసం సగటున ప్రతి రోజు 40 వేల మంది భక్తులు ఆలయానికి వస్తున్నట్లు అంచనా.

03/31/2018 - 16:27

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఖానాబల్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాపిక్ కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ ట్రాఫిక్ పోలీసు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.

Pages