S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/31/2018 - 18:13

బెంగళూరు: గుజరాత్‌లో దళితులపై అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విమర్శించారు. ప్రధాని మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో దళితులపై ఎన్నో ఘోరాలు జరుగుతుంటే ఇక్కడ ఆ పార్టీకి చెందిన నేత అబద్దాలు మోసుకొచ్చి ప్రచారం చేస్తున్నాడని ట్వీట్ చేశారు. దళితులను మాయ మాటలతో మోసం చేస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ గూండాలు అని అంటున్నాడని అన్నారు.

03/31/2018 - 16:26

బెంగళూరు: కర్నాటకలో లింగాయత్ ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఆయన మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. లింగాయత్‌లకు మైనారిటీ హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ నాలుగన్నరేళ్లు ఎందుకు ఆగాల్సి వచ్చిందని అన్నారు. కర్నాటకలో పొత్తు లేకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. సొంతంగా అధికారాన్ని చేపడుతుందని అన్నారు.

03/31/2018 - 16:21

న్యూఢిల్లీ సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రీతి విహార్‌లో విద్యార్థులు వాహనాలను అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న యువజన కాంగ్రెస్ నేతలను, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఇప్పటి వరకు 60మందిని విచారించినట్లు పోలీసులు తెలిపారు.

03/31/2018 - 13:44

హైదరాబాద్: హనుమన్‌ జయంతి పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు.

03/31/2018 - 13:26

గోరఖ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకుగానూ ఈ కేసు దాఖలైంది. ఐపీసీ 299,500 సెక్షన్ల కింద ఈ కేసులను ధాఖలు చేశారు. డయేరియా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు దాఖలైంది. బీజేపీ నేత సులబ్‌మణి త్రిపాఠి ఈ కేసు వేశారు.

03/31/2018 - 13:21

న్యూఢిల్లీ:ఐసీఐసీఐ బ్యాంక్ సిఇఓ చందాకొచ్చిర్ భర్తపై సిబిఐ ప్రాథమిక విచారణకు సిద్ధమైంది. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు చందాకొచ్చిర్ కుటుంబం ఆయాచితంగా లబ్ధిపొందిందనే ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. చందాకొచ్చిర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ అనుమానితులుగా పేర్కొంది.

03/31/2018 - 05:02

మైసూరు, మార్చి 30: ఈవారం మొదట్లో దావణగేరేలో తాను మాట్లాడిన మాటల్లో దొర్లిన పొరపాటును భాజపా అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం అంగీకరించారు. ‘సిద్దరామ య్య అవినీతిని ప్రస్తావించే సమయంలో నేను పొరపాటు పడ్డా. కానీ కర్ణాటక ప్రజలు అటువంటి పొరపాటుకు తావివ్వబోరు. ఎందుకంటే వా రికి సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరు బాగా తెలుసు.

03/31/2018 - 03:56

లక్నో, మార్చి 30: రాజకీయంగా ఎస్పీ, బీఎస్పీల పొత్తు కొనసాగితే యూపీలో ఎన్డీయేకు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని కేంద్ర మంత్రి, ఎన్డీయే భాగస్వామ్యపక్ష రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ-ఏ) చీఫ్ రామ్‌దాస్ అతావాలే వ్యాఖ్యానించారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీకి సాటి ఎవరూ లేరన్నారు.

03/31/2018 - 03:55

న్యూఢిల్లీ, మార్చి 30: తూర్పు ఆఫ్రికా అభివృద్ధికి కచ్చీ పటేల్ వర్గం ప్రజల పాత్రను ప్రధా ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. విదేశాల్లో నివసించే భారతీయులు మన దేశానికి శాశ్వత రా యబారులున్నారు. నైరోబీ, కెన్యాల్లోని ‘శ్రీ కచ్చీ లెవా పటేల్ సమాజ్’ ప్రజల రజతోత్సవాలను పురస్కరించుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడివారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

03/31/2018 - 03:51

ఛండీగఢ్, మార్చి 30: తన అధికార వాహనంపై ఇద్దరు వ్యక్తులు రాళ్లు విసిరారని హర్యా నా ఆరోగ్యశాఖ మంత్రి విజ్ శుక్రవారం తెలిపారు. తాను పానిపట్‌లోని సెక్రటేటియట్ భవనం నుంచి కారులో బయటకు వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందన్నారు. కారు అ ద్దం పగిలింది తప్ప ఎవరికీ ఏవిధమైన గాయాలు తగల్లేదన్నారు.

Pages