S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/13/2018 - 15:50

బస్తర్:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్‌ జవాన్లపై మంగళవారం మెరుపుదాడి చేసి 9 మందిని బలిగొన్నారు. సుక్మా జిల్లా కిష్టారాం - పలోడి ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలను నక్సలైట్లు శక్తిమంతమైన మందుపాతరలతో పేల్చివేశారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సుక్మా జిల్లాలో ఈ దాడి జరిగింది.

03/13/2018 - 13:39

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనపై శాసనమండిలోనూ కాంగ్రెస్ సభ్యులపై వేటు పడింది. వీరి సస్పెన్షన్‌ను మంత్రి కడియం శ్రీహరి ప్రతిపాదించగా డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ ఆమోదం తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు మండలి నుంచి షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

03/13/2018 - 13:17

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో), లెఫ్టినెంట్ గవర్నర్‌లకు పంపినట్టు చెబుతున్నారు.

03/13/2018 - 13:09

ఢిల్లీ: విభజన హామీలు, ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్ల కార్డులను చేతబూనిన ఎంపీలు నినాదాలు ఇస్తూ ఆందోళన నిర్వహించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజు దగ్గర్నుంచి ఎంపీలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

03/13/2018 - 13:44

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. మంగళవారం ఉదయం సభ మొదలైన వెంటనే వివిధ అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు.

03/13/2018 - 12:58

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మంగళవారం ఉదయం అల్మోరా ప్రాంతం నుంచి నైనిటాల్‌ జిల్లాలోని రామ్‌నగర్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు తోటమ్‌ సమీపంలో లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

03/13/2018 - 03:06

న్యూఢిల్లీ, మార్చి 12: పార్లమెంటు ఉభయ సభలు సోమవారం కూడా పని చేయలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకే, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతో ఉభయ సభలు స్తంభించిపోయాయి. లోక్‌సభ రెండు విడతల్లో కేవలం రెండు నిమిషాలు కొనసాగితే రాజ్యసభ మొదట ఏడు నిముషాలు, ఆ తరువాత కొన్ని నిమిషాలు కొనసాగిన అనంతరం మంగళవారం నాటికి వాయిదాపడ్డాయి.

03/13/2018 - 02:47

న్యూఢిల్లీ, మార్చి 12: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కేసు కొత్త మలుపుతిరిగింది. సునంద పుష్కర్‌ది హత్యేనంటూ ఓ రహస్య నివేదిక వెల్లడించింది. ఆమెను ఎవరు చంపిందీ విచారణలో తెలిసిందని, దర్యాప్తు అధికారుల వద్దా కచ్చితమైన సమాచారం ఉందంటూ ఓ వార్తా సంస్థ పేర్కొంది. సునంద పుష్కర కేసులో మొదటి నుంచీ మిస్టరీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

03/13/2018 - 02:45

థార్, మార్చి 12: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం మండు నగరంలో సోమవారం పర్యటించారు. జహాజ్ మహల్ తదితర ప్రాంతాలను ఆమె సందర్శించారు. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ఇక్కడకు వచ్చారు. మండు ప్రాంతంలోని చారిత్రక ప్రాంతాల్లో రెండు గంటలపాటు హిల్లరీ గడిపారు.

03/13/2018 - 02:43

షిల్లాంగ్, మార్చి 12: మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కన్రాడ్ సంగ్మా సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో అవలీలగా విజయం సాధించారు. 35మంది సభ్యుల మద్దతుతో ప్రమాణ స్వీకారం చేసిన కన్రాడ్ ప్రభుత్వానికి శాసనసభలో జరిగిన ఓటింగ్‌లో మద్దతు తెలిపారు. కన్రాడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 20 ఓట్లు రాగా, ఒక ఓటు చెల్లలేదు. ప్రోటెమ్ స్పీకర్ ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.

Pages