S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/11/2018 - 02:47

త్రిపురలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీపీఎం ఓటమి పాలు కావడం, బీజేపీ విజయం సాధించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అల్లర్లు చెలరేగాయ. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తమ కార్యకర్తలపై దాడులను జరిగిన ప్రాంతాలను శనివారం సందర్శించారు. అగర్తలాలో ధ్వంసమైన పార్టీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

03/11/2018 - 02:45

నాగ్‌పూర్, మార్చి 10: దేశంలో ప్రాథమిక విద్యను మాతృభాష లేదా దేశంలోని ఏదో ఒక భాషలో నేర్పించాలని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రాన్ని కోరింది. అందుకనుగుణంగా విధాన రూపకల్పన చేపట్టాలని సూచించింది. ఇక్కడ జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ త్రైవార్షిక సమావేశాల సందర్భంగా ‘్భరతీయ’ భాషల పరిరక్షణ చేపట్టాలని తీర్మానించారు.

03/11/2018 - 02:42

న్యూఢిల్లీ, మార్చి 10: సరైన నిధులు అందక కొన్ని పథకాలు నీరసించి పోతుంటే, నిధులుండీ వినియోగించుకోలేక కొన్ని శాఖలు అలసత్వంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పట్టణాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో నిధులను సద్వినియోగం చేయకపోవడాన్ని పార్లమెంటరీ ప్యానల్ దృష్టికి వచ్చింది.

03/11/2018 - 02:42

న్యూఢిల్లీ, మార్చి 10: ఈ ఏడాది అంతర్జాతీయ యోగ కార్యక్రమ నిర్వహణకు, జైపూర్, హైదరాబాద్, అహమ్మదాబాద్, మైసూర్ నగరాలను కేంద్రం షార్ట్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ జాబితాను ప్రధాని కార్యాలయానికి పంపారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పై నగరాల్లో ఎక్కడ నిర్వహించేదీ పీఎంఓ నిర్ణయిస్తుంది.

03/11/2018 - 02:28

న్యూఢిల్లీ, మార్చి 10: సంఘర్షణలు, ఉద్యమాలే పరమావధిగా సాగిన కరడుగట్టిన రాజకీయాలకు కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకప్పుడు ఈ రకమైన రాజకీయాలు అప్పటి సామాజిక అవసరాలను బట్టి కొనసాగినా ఇప్పుడు వాటికి ఏమాత్రం ఆస్కారం లేదని పేర్కొన్న ఆయన దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందని 115 జిల్లాల ప్రగతికి నడుం బిగించాలని చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చారు.

03/11/2018 - 02:25

కేడెట్లలో ఎనలేని ఉత్సాహం వెల్లివిరిసింది. శిక్షణను పూర్తిచేసుకున్న ఆనందం వారి ముఖాల్లో మరింతగా కనిపించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో కనిపిస్తున్న ఆనందమిది.

03/11/2018 - 02:23

అజంగఢ్, మార్చి 10: త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసం తరువాత ఆగంతకుల దురాగతాలు దేశవ్యాప్తంగా పాకాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాజపట్టీ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం తలను గుర్తుతెలియని వ్యక్తులు కొట్టేశారని పోలీసులు వెల్లడించారు. కెప్టెన్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

03/11/2018 - 02:19

న్యూఢిల్లీ, మార్చి 10: భారత ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పు ఐదేళ్ల క్రితం చోటుచేసుకుంది. అదే 2013లో ప్రవేశపెట్టిన ‘వీళ్లెవరూ వద్దు’ ఆప్షన్. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రవేశపెట్టిన నన్ ఆఫ్ ది అబౌ (నోటా)కు ఓటు వేస్తున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013 సెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు ‘బ్యాలెట్ పేపర్లు/ ఈవీఎం యంత్రాల్లో నోటాకు చోటు కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

03/11/2018 - 01:25

న్యూఢిల్లీ, మార్చి 10: తెలంగాణకు గత మూడున్నరేళ్లలో కేంద్రం నుంచి అదనంగా పైసాకూడా రాలేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కె తారకరామారావు దుయ్యబట్టారు. ఎన్డీయే గత మూడున్నరేళ్లలో మిత్రులకంటే శత్రువలనే అధికంగా సంపాదించుకుందన్నారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలని అన్నారు.

03/11/2018 - 02:56

కోట, మార్చి 10: నలభై ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురు దుర్మార్గులు ఆ ఘనకార్యాన్ని సోషల్ మీడియాలో పెట్టి తన పైశాచికత్వాన్ని చాటుకున్నారు. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన బాధితురాలు ఫిర్యాదుతో వెలుగుచూసింది. అత్యాచార ఘటన నెల రోజుల క్రితమే జరిగిందని బరాన్ పోలీసులు వెల్లడించారు. రేప్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టుచేసిన కామాంధులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Pages