S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/12/2016 - 19:23

దిల్లీ:హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా ఉపాధ్యక్షుడు రాహుల్‌కి వూరట లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌. భానుమతిలతో కూడిన ధర్మాసనం సోనియా, రాహుల్‌ సహా ఐదుగురికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారి తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు.

02/12/2016 - 16:48

న్యూదిల్లి:కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీయూష్‌గోయల్ భేటి అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులపై చర్చించారు. అంతకుముందు ఆయన ప్రధాని మోదీతో సమావేశమై తెలంగాణకు రావలసిన నిధులు, పథకాలపై చర్చించారు.

02/12/2016 - 16:31

డెహ్రడూన్‌: మే 11వ తేదీన ఉదయం 4:30గంటలకు బద్రినాథ్‌ ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ సీఈవో బీడీ సింగ్‌ తెలిపారు. గతేడాది నవంబర్‌ 17న ఆలయాన్ని అధికారులు మూసివేశారు. తిరిగి మేలో తెరవనున్నారు. తెరవడానికి ముహూర్తాన్ని వసంత పంచమి సందర్భంగా ఈరోజు నిర్ణయించారు.

02/12/2016 - 16:29

దిల్లీ: జవహర్‌లాల్‌ నేషనల్‌ యూనివర్సిటీలో వివాదం నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘ ప్రెసిడెంట్‌ కన్హయ్యా కుమార్‌ను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా ఇటీవల జేన్‌యూ విద్యార్థులు ఆందోళన చేశారు.

02/12/2016 - 11:56

ముంబయి : ముంబయి దాడుల కుట్ర కేసులో అప్రూవర్‌గా మారి ప్రస్తుతం అమెరికాలోని జైలులో ఉంటున్న డేవిడ్ హెడ్లీ నాలుగో రోజు శుక్రవారం కూడా ఇక్కడి న్యాయమూర్తితో వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పాల్గొని మరిన్ని విషయాలు బయటపెట్టాడు. 2008 ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు తాను పాకిస్తాన్‌లో ఉన్నానని, ముంబయిలో దాడులకు సంబంధించి పలువురు వ్యక్తులతో తాను ఫోన్‌లో సంభాషించానని న్యాయమూర్తికి వివరించాడు.

02/12/2016 - 11:55

ముంబయి : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ 1.93 లక్షల జరిమానా విధించిన విషయం సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి సేకరించిన సమాచారంతో ఆలస్యంగా బయటపడింది. దాదాపు రెండేళ్ల క్రితం షారుఖ్ తన ఇంటి బయట రోడ్డును ఆక్రమించి ర్యాంప్‌ను నిర్మించటంతో మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీచేసింది. అయినా ఆయన పట్టించుకోకపోవడంతో ర్యాంప్‌ను మున్సిపల్ ఉద్యోగులు ధ్వంసం చేశారు.

02/12/2016 - 06:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే అంశాలపై గవర్నర్‌కు ఎలాంటి అధికారం ఉండదని, అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయం అవుతుందని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచి ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

02/12/2016 - 06:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. రైల్వే బోర్డు చైర్మన్ ఎ.కె.మిట్టల్ సమక్షంలో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వేద్‌ప్రకాశ్ దుదేజా, తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఒప్పందంపై సంతకాలు చేశారు.

02/12/2016 - 05:49

ముంబయి: పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్, లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీ గురువారం ముంబయి కోర్టు ముందు విచారణలో ఒక కీలక అంశాన్ని వెల్లడించాడు. 2004లో గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇషత్ జహాన్ ఎల్‌ఇటి ఉగ్రవాద సంస్థకు చెందిన మానవబాంబేనని తెలిపాడు. ఇషత్ జహాన్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ అని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

02/12/2016 - 05:48

ధార్వాడ్: సియాచిన్‌లో ఎవరూ ఊహించని విధంగా ప్రాణాలతో బైటపడినప్పటినుంచి మృత్యువుతో పోరాటం జరిపిన లాన్స్‌నాయక్ హనుమంతప్ప చివరికి గురువారం కన్ను మూశారన్న వార్త తెలియగానే ధార్వాడ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం శోకసంద్రంగా మారింది.

Pages