S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/10/2018 - 05:09

ఇస్లామాబాద్, మార్చి 9: పాక్ మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌ను అరెస్ట్ చేసి, ఆయన ఆస్తులను జప్తు చేయాలంటూ ప్రత్యేక పాకిస్తాన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. 2007లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన అంశంపై, ఆయన రాజద్రోహం నేరం కింద కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. 2014, మార్చిలో ఆయనపై పెషావర్ హైకోర్టులో రాజద్రోహ నేరారోపణ చేస్తూ పాక్ ఆంతరంగిక మంత్రిత్వశాఖ పిటిషన్ దాఖలు చేసింది.

03/10/2018 - 05:07

న్యూఢిల్లీ, మార్చి 9: ప్రముఖ నటి శ్రీదేవి (54) మృతికి సంబంధించి దాచిపెట్టడానికి ఏమీలేదని శుక్రవారం విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘నాకు తెలిసినంతవరకు, యుఏఈ ప్రభుత్వం అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేసి మాకు అందజేసింది. వాటి ఆధారంగా శ్రీదేవి పార్థివ దేహాన్ని భారత్‌కు తీసుకొచ్చాం. ఇందులో అనుమానించడానికి ఏముంది?

03/10/2018 - 04:53

కెరీర్‌ను మలుపుతిప్పేది పరీక్ష, కొత్త జీవితాన్ని ప్రసాదించేది వివాహం - అలాంటి ఈ రెండూ ఒకదాని వెంట ఒకటి వస్తే ‘పరీక్ష’ తప్పదు మరి. వివాహమై 24 గంటలు గడవక ముందే బి.ఏ పరీక్షకు హాజరైన బికనైర్‌కు చెందిన నవ వధువు అరుణా ప్రజాపత్.

03/10/2018 - 04:50

అగర్తలా, మార్చి 9: ఎర్రకోటలో కమలనాథుల ప్రభుత్వం కొలువుదీరింది. త్రిపురను దశాబ్దాల పాటు పాలించిన వామపక్ష కూటమిని అనూహ్యంగా ఓడించిన బీజేపీ శుక్రవారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విప్లవ్‌కుమార్ దేవ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. స్ప్రాలింగ్ అస్సాం రైఫిల్స్ గ్రౌండ్‌లో గవర్నర్ తథాగత్ రాయ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

03/10/2018 - 04:52

సింగపూర్, మార్చి 9: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శుక్రవారం సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్‌ను, ఇతర సీనియర్ నాయకులను కలుసుకున్నారు. రాహుల్ గాంధీ సింగపూర్, మలేసియాల్లో మూడు రోజుల పర్యటన జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌ను కూడా కలుసుకుంటారు. ఇదే సమయంలో ఆయన ఆయాదేశాల్లోని భారత్‌కు చెందిన వాణిజ్య వర్గాలతో సమావేశమవుతారు.

03/10/2018 - 04:47

న్యూఢిల్లీ, మార్చి 9: యూపీఏ తరువాత అంతే బలమైన జాతీయ కూటమికి సారథ్యం వహిస్తున్న పార్టీగా బీజేపీ ఈ నాలుగేళ్లలో మరింత శక్తిని సంతరించుకుంది. 2014 ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, శివసేన, కాశ్మీర్‌లో పీడీపీ సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగి దీనికి మరింత శక్తిని అందించాయి. ఈ నాలుగేళ్లలో జాతీయ రాజకీయాల్లో అనూహ్య మార్పు వచ్చింది.

03/10/2018 - 04:46

ముంబయి, మార్చి 9: ఎన్‌డీఏ పాలనలో దేశం తిరోగమన దిశగా వెళ్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. కుమారుడు రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత మీడియాకు దూరంగా ఉంటున్న సోనియా ముంబయిలో శుక్రవారం ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

03/10/2018 - 04:45

ఇస్లామాబాద్, మార్చి 9: ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సరుూద్ ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ మిల్లీ ముస్లిం లీగ్‌కు (ఎంఎంఎల్) గుర్తింపు లభించే అవకాశాలు మెరుగైనట్టు పాక్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

03/09/2018 - 16:28

న్యూఢిల్లీ : రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. పలు అంశాలపై విపక్ష సభ్యులు విభజన హామీలు నెరవేర్చాలని తెదేపా సభ్యులు, రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని తెరాస సభ్యులు ఆందోళన చేయడంతో ఈ ఉదయం రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు 2.30 గంటలకు వాయిదా వేశారు.

03/09/2018 - 16:17

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం చార్టెట్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. మరో 14 రోజుల పాటు ఆయన కస్టడీని కోర్టు పొడిగించింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఫిబ్రవరి 28న భాస్కరరామన్ కోర్టును అభ్యర్థించారు.

Pages