S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/09/2018 - 12:39

వాషింగ్టన్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. దక్షిణ కొరియా ప్రతినిథి బృందం ద్వారా కిమ్ ఈ ఆహ్వానాన్ని వైట్ హౌస్‌కు పంపించారు. తాను మే నెలనాటికి కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సమావేశమవుతానని ట్రంప్ తెలిపారు. తాజా పరిణామాలపై ట్రంప్ ఓ ట్వీట్ కూడా ఇచ్చారు. కిమ్‌తో సమావేశానికి ప్రణాళిక జరుగుతున్నట్లు తెలిపారు.

03/09/2018 - 12:43

పాల్ఘార్ : మహారాష్ట్రలోని ఫాల్ఘార్ పట్టణంలో గురువారం రాత్రి జరిగిన బాయిలర్ పేలుడు ధాటికి సంభవించిన అగ్నిప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాయిలర్ పేలుడు ధాటికి పదికిలోమీటర్ల దూరంలోని భవనాలు కంపించాయి. ప్రజలంతా ఇళ్లలో నుంచి రోడ్ల మీదకు వచ్చారు.

03/09/2018 - 12:40

న్యూఢిల్లీ: కారుణ్య మరణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కారుణ్య మరణాలపై తీర్పు వెలువరించింది. ‘‘గౌరవంగా మరణించే హక్కు మనుషులకు ఉంది..’’ అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కారుణ్య మరణానికి అనుమతించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

03/09/2018 - 12:41

పంజాబ్: ప్రముఖ పంజాబ్ సూఫీ గాయకుడు ఉస్తాద్ ప్యారేలాల్ వదాలీ కన్నుమూశారు. అమృత్‌సర్‌లో ఈ ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందారు. ప్యారేలాల్ వదాలీ ఉస్తాద్ పురానా చంద్ వాదాలీ సోదరుడు. పంజాబీ సూఫీ సంగీతంలో వీరు ప్రముఖులుగా పేరుగాంచారు. కాఫీయన్, గజల్, భజనతో పాటు వివిధ రకాల పాటలు బాలీవుడ్ పాటలు పాడటంతో వీరు సుప్రసిద్ధులు.

03/09/2018 - 12:42

న్యూఢిల్లీ: టిడిపి ఎంపీల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. విభజన హామీల అమలులో జాప్యాన్ని నిరసిస్తూ టిడిపి ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

03/09/2018 - 12:00

న్యూఢిల్లీ: ఏపీకి న్యాయం చేయాలంటూ దేశరాజధాని ఢిల్లీలో ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. టిడిపి ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో నిన్న రాజీనామా చేసిన విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా పాల్గొన్నారు.

03/09/2018 - 04:29

కోహిమా, మార్చి 8: నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ నేత నీఫియు రియో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ పీబీ ఆచార్య రియోతో ప్రమాణ స్వీకారం చేయించారు. నాగాలాండ్ ముఖ్యంత్రి పదవి చేపట్టడం ఇది నాలుగోసారి. బీజేపీ భాగస్వామ్యంతో పీపుల్స్ డెమోక్రటిక్ అలయెన్స్ తరఫున రియో ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ నేత వై పట్టాన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

03/09/2018 - 04:25

న్యూఢిల్లీ, మార్చి 8: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల పెంపుదల బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలను కొనసాగించారు. గురువారం పార్లమెంట్ అవరణలో ప్లకార్డులను పదర్శస్తూ నిరసన తెలిపారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ పంపిన బిల్లు విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు.

03/09/2018 - 04:24

చెన్నై, మార్చి 8: ద్రవిడ ఉద్యమ నేత ఇవి రామస్వామి పెరియార్‌పై బీజేపీ నేత హెచ్ రాజా చేసిన వ్యాఖ్యలు అనాగరికమేనని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. అయితే, తన వ్యాఖ్యలను తొలగించి పచ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడమే మంచిదని సూచించారు.

03/09/2018 - 01:48

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మహిళ శక్తి సామర్థ్యాల గురించి విఫులంగా చర్చించారు. అన్ని రంగాల్లోనూ మహిళలు సాధిస్తున్న ప్రగతిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ రైల్వే వినూత్న కార్యక్రమాల్ని చేపట్టింది. వివిధ రంగాల్లో అలుపెరగని ప్రతిభను కనబరుస్తున్న మహిళలను మనం వార్తలలో తెలుసుకుంటూనే ఉన్నాం.

Pages