S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/09/2018 - 01:39

న్యూఢిల్లీ, మార్చి 8: పార్లమెంటు ఉభయ సభల్లో వరుసగా నాలుగో రోజు కూడా గొడవ జరిగింది. రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అంశంపై చర్చ జరిపించటంలో విజయం సాధించారు. లోక్‌సభ మాత్రం ఎలాంటి చర్చ లేకుండానే గొడవ, గందరగోళం మధ్యే శుక్రవారానికి వాయిదా పడింది.

03/09/2018 - 01:38

న్యూఢిల్లీ, మార్చి 8: ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనను కొనసాగించారు. గురువారం ఉదయం పార్లమెంట్ అవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు విభజన హామీలు అమలు చేయాలని ఫ్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన కొనసాగించారు.

03/09/2018 - 01:33

జుంజును (రాజస్థాన్), మార్చి 8: పొత్తిళ్లలోని ఆడపిల్లలను అత్తగార్లే సంరక్షించి అమ్మతనం ప్రదర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు, ఈ విషయంపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించేందుకు సామూహిక ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వాలూ ముందుకు కదలాలని మోదీ పిలుపునిచ్చారు.

03/09/2018 - 01:03

న్యూఢిల్లీ, మార్చి 8: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, సైన్సు,టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి గురువారం సాయంత్రం ఆరు గంటలకు తమ రాజీనామా లేఖలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు.

03/08/2018 - 16:56

న్యూఢిల్లీ: తాను ఇప్పట్లో భారత్‌కు రాలేనని పీఎన్‌బీ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మేనమామ మెహుల్ ఛోక్సీ పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంపై సీబీఐకి లేఖ రాస్తూ.. ‘‘నా పాస్‌పోర్టును పాస్‌పోర్టును సస్పెండ్ చేయడం.. రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కును హరించడమే..’’ అని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ, ఇప్పట్లో ప్రయాణం చేయలేనని చెప్పుకొచ్చారు.

03/08/2018 - 16:10

న్యూఢిల్లీ: మన దేశంలో ఎప్పటినుంచో స్త్రీలను ఆరాధించడం, గౌరవించడం సంప్రదాయంగా వస్తోందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భోపాల్‌లో ఇవాళ ఆయన మహిళల కోసం కొత్తగా ‘‘ముఖ్యమంత్రి మహిళా కోశ్’’ పథకాన్ని ఆవిష్కరించారు. వివాహం కాని 50 యేళ్లు పైబడిన ఒంటరి మహిళలకు ఈ పథకం కింద పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించారు.

03/08/2018 - 15:56

వనపర్తి : అడ్డాకుల మండలం కందూరులో ముగ్గురు యువకులు శ్రీరామలింగేశ్వరస్వామి కోనేరులో పడి మృతి చెందారు. జాతర సందర్భంగా కోనేరులో స్నానానికి వెళ్లిన రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు సోదరులు మహబూబ్‌నగర్ కు చెందినవారుగా గుర్తించారు.

03/08/2018 - 15:50

న్యూఢిల్లీ: పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీల్లోనూ మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని మహిళా ఎంపీలంతా డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఎంపీలు రాజ్యస‌భ‌లో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత అంబికా సోనీ అన్నారు. మహిళా బిల్లుకు ఆమోదం దక్కాలంటే రాజకీయ విశ్వాసం ఉండాలని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు.

03/08/2018 - 13:58

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మహిళా పోలీసులు బైక్ లపై పెట్రోలింగ్ కు శ్రీకారం చుట్టారు. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ కాస్, సాకేత్ మాల్, గ్రీన్ పార్కు, సరోజిని నగర్ తదితర ప్రాంతాల్లో మహిళా పోలీసులు బైక్ లపై పెట్రోలింగ్ చేస్తూ కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే అమ్మాయిలకు రక్షణ కల్పిస్తున్నారు.

03/08/2018 - 13:58

న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఎంపీల ఆందోళనతో సభ శుక్రవారానికి వాయిదా పడింది.

Pages