S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/08/2018 - 13:40

కోహిమా: నాగాలాండ్‌లో భాజపా సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ‘నేషనల్‌ డెమోక్రటిక్‌-ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ)’ సీనియర్‌ నేత నెయిఫియు రియో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కోహిమాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ పి.బి. ఆచార్య ఆయన చేత ప్రమాణం చేయించారు.

03/08/2018 - 13:18

ఢిల్లీ: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహింకు అత్యంత సన్నిహితుడు, 1993 ముంబయి పేలుళ్ల కీలక కుట్రదారుడు ఫరూఖ్‌ తక్లా ఎట్టకేలకు భారత్‌కు చిక్కాడు. భారత్‌ నుంచి పారిపోయి పాతికేళ్లుగా దుబాయిలో తలదాచుకున్న ఫరూఖ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దుబాయి నుంచి గురువారం ఉదయం ఫరూఖ్‌ను దిల్లీకి తీసుకొచ్చింది. ఈ సాయంత్రం ముంబయిలోని టాడా కోర్టులో అతడిని హాజరుపరచనుంది.

03/08/2018 - 16:57

తిరువనంతపురం: దేశంలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేరళలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. కన్నూరు జిల్లాలోని తాలిపరాంబా తాలూకా ఆఫీస్ దగ్గర్లోని గాంధీ విగ్రహాన్ని గురువారం ఉయదం ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. విగ్రహంపైకి రాళ్లు విసరడంతో కళ్లద్దాలు, మెడలోని దండ ధ్వంసమయ్యాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు.

03/08/2018 - 12:22

ఒడిస్సా: నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా పూరీ సముద్ర తీరాన నారీశక్తి వెల్లివిరిసింది. ప్రముఖ సైకిత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శిష్యులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ రూపొందించిన ప్రత్యేక సైకిత శిల్పాలు చూపురులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు పురుషులకు ఏవిషయంలోనూ ఏమాత్రం తీసిపోరన్నట్లు ఈ సైకిత శిల్పాలు ఉన్నాయి. సైకిత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బహ్రెయిన్‌లో ఉన్నారు.

03/08/2018 - 04:22

బెంగళూరు, మార్చి 7: కర్నాటక లోకాయుక్త జస్టిస్ పీ విశ్వనాథశెట్టిపై బుధవారం ఆయన కార్యాలయంలోనే హత్యాయత్నం జరిగింది. కేసు వాయుదాలపై వాయుదాల పడడంతో విసిగిపోయిన ఓ ఫిర్యాదిదారు శెట్టిపై కత్తితో దాడి చేశారు. ఏకంగా ఐదుసార్లు కత్తితో పొడిచాడు. కత్తిపోట్లతో కుప్పకూలిపోయిన లోకాయుక్తను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జస్టిస్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

03/08/2018 - 04:19

న్యూఢిల్లీ, మార్చి 7: ప్రతిపక్షం, స్వపక్షం కలిసికట్టుగా ఎన్‌డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడటంతో మూడోరోజు బుధవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోయాయి. లోక్‌సభ రెండు విడతల్లో కేవలం ఏడు నిమిషాలు మాత్రమే కొనసాగి వాయిదా పడితే... రాజ్యసభ కూడా రెండు విడతల్లో కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేసిన గురువారానికి వాయిదా పడకతప్పలేదు.

03/08/2018 - 04:16

ఆ వానరానికి ఏం తెలుసు.. అది 135కోట్ల మందికి రాజధాని అని.. ఎక్కడి నుంచి వచ్చిందో అమాంతం ఢిల్లీలోని విజయ్ చౌక్ ప్రధాన రహదారిని దాటుతూ కనిపించింది. ఇంకేముంది ఓ పత్రికా ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. ఎంచక్కా దూరంగా కనిపిస్తున్న ఇండియా గేట్‌తోసహా క్లిక్ మనిపించాడు.

03/08/2018 - 04:15

న్యూఢిల్లీ, మార్చి 7: నీట్-2018, అఖిల భారత ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేశారు. ఈ మేరకు సీబీఎస్‌ఈకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం దీనికి సంబంధించిన పిటిషన్ విచారించింది.

03/08/2018 - 04:13

న్యూఢిల్లీ, మార్చి 7: ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేతృత్వంలో ‘చలో పార్లమెంట్’ పేరుతో నిర్వహించిన నిరసన బుధవారం కూడా జరిగింది. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన వామపక్ష, హామీల సాధన సమితి కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’, ‘మా హక్కులు మాకివ్వండి’, ‘మోదీ సర్కార్ డౌన్‌డౌన్’ అన్న నినాదాలతో ఆ ప్రాంతామంతా హోరెత్తింది.

03/08/2018 - 04:11

న్యూఢిల్లీ, మార్చి 7: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీకీ చేందిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ ఎంపీలు వరసగా మూడోరోజూ ఆందోళన కొనసాగించారు. బుధవారం ఉదయం పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు ప్లకార్డులను చేతబట్టి నినాదాలిస్తూ నిరసన తెలిపారు.

Pages