S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/04/2018 - 03:54

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం విజయ సంకేతాన్ని చూపుతున్న ముకుల్ సంగ్మా. ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయన ముకుల్ నైరుతి గారోహిల్స్‌లోని అంపతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
మేఘాలయలో 21 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీకి రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.

03/04/2018 - 03:49

చెన్నై, మార్చి 3: కావేరీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష బృందాన్ని కలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరించినట్లయితే, ఎంపీలందరూ రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి పళనిస్వామికి డిఎంకె ప్రతిపాదించింది. శనివారం పళనిస్వామితో సమావేశమైన డిఎంకె నేత స్టాలిన్ ఎంపిల రాజీనామా అంశాన్ని గురించి చర్చించారు.

03/04/2018 - 03:45

గడ్చిరోలి, మార్చి 3: గడ్చిరోలిలో జరిగిన పుస్తక పఠనం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో 7వేల మంది ఈ పుస్తక పఠన కార్యక్రమంలో పాల్గొని గత ఏడాది టర్కీలో సృష్టించిన రికార్డును అధిగమించారని జిల్లా అధికారులు తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డుల సంస్థ ప్రతినిధుల సమక్షంలో ఈ అత్యంత పుస్తక పఠన కార్యక్రమం జరిగిందని, దీనిని పోలీసు అధికారులే నిర్వహించారని తెలిపారు.

03/04/2018 - 02:13

న్యూఢిల్లీ, మార్చి 3: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, ప్రాంతీయ భద్రతకు పెద్దపీట వేస్తూ ఉమ్మడిగా కృషి చేయాలని భారత్-వియత్నాలు నిర్ణయించాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక విస్తరణ మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో, రెండు దేశాల నిర్ణయం ద్వారా చైనాకు ఒక హెచ్చరికను పంపినట్లయింది.

03/04/2018 - 02:11

అగర్తలా, మార్చి 3: త్రిపురలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి (ఎల్‌ఎఫ్) పరిస్థితి కడుదయనీయంగా మారింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 1978లో మొత్తం 56 సీట్లను కైవసం చేసుకొని తన తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. నాటి మొట్టమొదటి లెఫ్ట్ ప్రభుత్వానికి నృపేన్ చక్రవర్తి నేతృత్వం వహించారు. కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేదు.

03/04/2018 - 02:05

న్యూఢిల్లీ, మార్చి 3: త్వరలో జరగనున్న కర్నాటక శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. అనంతరం పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళలో అధికారంలో సాధించినప్పుడే బీజేపీకి స్వర్ణయుగం అని ఆయన తెలిపారు. బీజేపీకి గోల్డన్ పిరియడ్ ఎప్పుడు వస్తుందని మీరు చాలాకాలం నుండి అడుగుతున్నారు.

03/04/2018 - 02:02

న్యూఢిల్లీ, మార్చి 3: స్థిరమైన అభివృద్ధి అజెండా, పార్టీ యంత్రాంగం కృషితో త్రిపురలో భారతీయ జనతా పార్టీ సున్నానుంచి శిఖరాగ్రానికి చేరిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాపై వరుస ట్వీట్లు చేస్తూ, త్రిపురలో బీజేపీది ‘అసాధారణ విజయం’గా అభివర్ణించారు. ‘స్థిరమైన అభివృద్ధి నినాదం బలంగా పని చేసింది.

03/04/2018 - 01:06

అగర్తల, షిల్లాంగ్, కోహిమా, మార్చి 3: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల విజయ దుందుభి ఈశాన్యంలోనూ మారుమోగింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు అనూహ్యమైన తీర్పునిచ్చారు. గత పాతిక సంవత్సరాలుగా త్రిపురలో తిరుగులేని అధికారం చెలాయిస్తూ వచ్చిన సిపిఎం సారథ్యంలోని వామపక్ష కూటమి పాలనకు చరమగీతం పాడి బిజెపి కూటమికి అనూహ్య రీతిలో మూడింట రెండొంతుల మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు.

03/03/2018 - 17:38

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి విజయం కార్యకర్తలదని బాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ త్రిపురలో వామపక్షల పాలన నుంచి విముక్తికావాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు.
రాబోయే కాలంలో కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిసాలో విజయం సాధిస్తే స్వర్ణయుగం సాధించినట్లని అన్నారు. ప్రజలు

03/03/2018 - 17:37

న్యూఢిల్లీ: త్రిపుర ఎన్నికల ఫలితాలు నవశకానికి నాందీ పలుకుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో
భాజాపా విజయం పట్ల ఆయన తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. త్రిపురలో విజయం సామాన్య విజయం

Pages