S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/02/2018 - 16:23

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఆ బ్యాంకుకు చెందిన ఆడిటర్ జనరల్‌ను గురువారంనాడు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కస్టడీని ఈ నెల 14 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

03/02/2018 - 16:19

బకు: అజైర్ బైజాన్ దేశ రాజధాని నగరం బకులో శుక్రవారంనాడు జరిగిన అగ్నిప్రమాదంలో ముప్పయి మంది సజీవ దహనం అయ్యారు. బకులోని ఓ హెల్త్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

03/02/2018 - 16:19

శ్రీనగర్: శ్రీనగర్‌లో మరో ఉగ్రవాది జనజీవన స్రవంతిలోకి వచ్చాడు. తల్లి పిలుపునకు స్పందించిన ఈ ఉగ్రవాది హృదయం తన ఉగ్రవాద కార్యకలపాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు డీజీపీ ఎస్‌పీ వైద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఈ విషయాన్ని ట్వీట్ చేవారు. ఆ యువకుడి కుటుంబానికి డీజీపీ శుభాకాంక్షలు తెలియజేశారు.

03/02/2018 - 16:29

న్యూఢిల్లీ: ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామపై భారత ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ దలైలామా భారతదేశంలో స్వేచ్ఛగా గతంలో వలే ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. భారత వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.

03/02/2018 - 16:48

ముంబై : దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శకుల‌లో మ‌ణిర‌త్నం ఒక‌రు. మేలిమి ముత్యాల్లాంటి సినిమాల‌ని తీసిన మ‌ణిర‌త్నంని బెంగ‌ళూర్ ఫిలిం ఫెస్టివ‌ల్‌(బిఐఎఫ్ఎఫ్‌)లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో స‌త్కరించారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్‌తో పాటు ఆ రాష్ట్ర సీఎం చేతుల మీదుగా మ‌ణిర‌త్నం ఈ అవార్డు అందుకున్నారు. విదాన‌సౌద‌లో జ‌రిగిన ఈవెంట్‌లో మ‌ణిరత్నంకి ప‌ది ల‌క్షల న‌గ‌దు, ప్రశంసా ప‌త్రంతో పాటు మోమెంటోని అందించారు.

03/02/2018 - 13:35

న్యూఢిల్లీ : హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు శుక్రవారం ఉదయం మోదీ ఓ ట్వీట్‌లో అందరూ హోలీని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు ,శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ ఆకాంక్షించారు.

03/02/2018 - 12:53

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందానికి ఎఫ్‌ఐపీబీ అనుమతిని చిదంబరం ఎలా ఇప్పించారని దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో చిదంబరం పాత్రపై దర్యాప్తు జరుపుతున్నామని సీబీఐ తెలిపింది. ఇదే కేసులో స్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా సీబీఐని ఈ ఏడాది జనవరి 4న సుప్రీంకోర్టు ఆదేశించింది.

03/02/2018 - 12:11

సిమ్లా: హిమచల్‌ ప్రదేశ్‌ భిలాస్పూర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి జాతీయ రహదారి 21పై కొండలోకి పడిపోయింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, ఒకరికి గాయలయ్యాయి. తీవ్ర గాయాలైన ఒకరిని దగ‍్గరలోని ఆసుపత్రికి తరలించారు. ​

03/02/2018 - 11:49

మదురై: పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలు మరణించారు. మదురైలో పలు చోరీల కేసులతో సంబంధమున్న ముత్తు ఇరుళాండి, శకుని కార్తి అనే రౌడీలు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మదురై-దిండుకల్‌ రోడ్డులోని సిక్కందర్‌ చావడిలో వీరితో పాటు మరో ముగ్గురు రౌడీలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగానే రౌడీలు కాల్పులు జరిపారు.

03/02/2018 - 16:39

న్యూఢిల్లీ: దేశ ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో హోలికా దహన్‌లో బాగంగా ప్రజలు నిప్పులపై నడిచారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఉన్న పర్మర్త్ నికేతన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్‌లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ప్రజలు ఘనంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు.

Pages