S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/16/2018 - 04:19

కోహిమా: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల డిమాండ్ సంగతి ఏమోగానీ... నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడి 54 ఏళ్లయినా ఇప్పటివరకూ అసెంబ్లీకి ఒక్కరంటే ఒక్క మహిళ ఎన్నికవ్వలేదు. నాగాలాండ్ అసెంబ్లీకి 12సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 27 అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 3న ప్రకటిస్తారు. అరవై స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 195 మంది పోటీ చేస్తున్నారు.

02/16/2018 - 02:14

జొర్హాట్, ఫిబ్రవరి 15: అస్సాంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ మైక్రోలైట్ హెలికాప్టర్ కూలిపోయన ఘటనలో ఇద్దరు భారత వైమానిక దళ ఉద్యోగులు మృతి చెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా వెళ్తున్న వైరస్ ఎస్‌డబ్ల్యూ 80 చిన్న హెలికాప్టర్ కూలిపోయింది. జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి టైకాఫ్ తీసుకున్న తరువాత మధ్యాహ్నం సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు.

02/16/2018 - 02:09

జింద్ (హర్యానా), ఫిబ్రవరి 15: బీజేపీ సారథ్యంలోని హర్యానా ప్రభుత్వం నిష్కళంకంగా పనిచేస్తూ ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కేంద్ర నిధులన్నీ అవినీతి గోదాలోకి వెళ్లిపోయేవని గురువారం ఇక్కడ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ సారథ్యంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని ప్రశంసించారు.

02/16/2018 - 02:04

భోపాల్, ఫిబ్రవరి 15: మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భోపాల్ బాధిత సంఘాలు ఏకమవుతున్నాయి. త్వరలో జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని భోపాల్ గ్యాస్ బాధిత సంఘాలు ప్రకటించాయి. భోపాల్ గ్యాస్ విషాద బాధితులకు పరిహారం ఇప్పించడం, వారి సమస్యలు పరిష్కరించడంతో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సంఘాలు ధ్వజమెత్తాయి.

02/16/2018 - 01:28

త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బీజేపీ నిర్వహించిన ర్యాలీకి భారీగా
తరలివచ్చిన జనం. ఈ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

02/16/2018 - 01:25

ఇటానగర్, ఫిబ్రవరి 15: దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగించే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ పథకాన్ని ఉద్యమ తరహాలో అమలు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పథకం వల్ల నాణ్యమైన, చౌకగా వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని, ఆరోగ్యరంగంలో సమూల మార్పులకు ఇది నాంది పలుకుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే పథకాల్లో ‘ఆయుష్మాన్’ ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలవబోతోందని ఆయన అన్నారు.

02/16/2018 - 01:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ ప్రత్యేకమైన అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా సహా ఆరు రాష్ట్రాలను సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదానికి సంబంధించి అప్పట్లో ట్రిబ్యునల్ తీర్పిచ్చింది.

02/16/2018 - 04:17

న్యూఢిల్లీ: కృష్ణ, గోదావరి జల బోర్డుల పరిధిని నిర్ధారించే అంశంపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విభేదాలకు పరిష్కారం కుదరలేదు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ గురువారం ఆంధ్రా, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు, బోర్డు అధికారులతో సమావేశమై వాటి పని తీరును సమీక్షించారు. ఈ సమావేశంలో బోర్డుల పరిధిని నిర్ధారించే అంశంపై ఇరు పక్షాలు వాదన వినిపించాయి.

02/16/2018 - 00:49

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: తెలంగాణ నిర్మిస్తున్న దేవాదులు ప్రాజెక్టుకు క్యాడ్‌వామ్ (కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్) కింద రూ.450 కోట్లు, భీమా ప్రాజెక్టుకు రూ.35 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని 99 సాగునీటి ప్రాజెక్టులను ఎంపిక చేసింది.

02/16/2018 - 00:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం విడుదల చేయవలసిన నిధుల గురించి చర్చించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై తెలంగాణాకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించనున్నారు.

Pages