S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/14/2018 - 00:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలుచేస్తున్న ‘ఉజ్వల యోజన’ మహిళల సాధికారతకు దోహదపడుతోందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. రాష్టప్రతి భవన్‌లో మంగళవారం ‘ఎల్‌పీజీ పంచాయత్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్ ఇవ్వాలన్న పథకం వారి అభివృద్ధికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు.

02/14/2018 - 00:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీల సంక్షేమానికి కేటాయింపులు 41 శాతం పెంచినట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ వెల్లడించారు. 2016-17 బడ్జెట్‌లో 12.10 శాతం అంటే 6,908 కోట్ల రూపాయలు కేటాయించగా 2018-19 బడ్జెట్‌లో 41 శాతానికి పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. అంటే 7,750 కోట్ల రూపాయలు ఓబీసీల కోసం కేటాయించినట్టు ఆయన తెలిపారు.

02/14/2018 - 00:43

అగర్తల, ఫిబ్రవరి 13: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు చేరాలంటే బీజేపీకే అధికారం అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్రిపుర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. త్రిపురలో ఈ నెల 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు ఆదిత్యనాథ్ సోమవారం అగర్తల చేరుకున్నారు.

02/14/2018 - 00:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలో డాక్టర్ల కొరత తీర్చి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సంతృప్తికరమైన వైద్య అవసరాలు తీర్చాలని యోచిస్తున్నట్టు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు వైద్య కళాశాలల స్థాయికి పెంచనున్నట్టు మంగళవారం ఇక్కడ తెలిపారు.

02/14/2018 - 00:41

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రాజకీయంగా అత్యంత కీలకమైన 64 కోట్ల కుంభకోణం బోఫోర్స్ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తనంతట తానుగా తప్పుకున్నారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ ఖాన్విల్కర్ విచారణ నుంచి ఎందుకు తప్పుకుంటున్నదీ వివరణ మాత్రం ఇవ్వలేదు.

02/14/2018 - 00:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లలో అమలవుతున్న క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. మంగళవారం హనుమంతరావు విలేఖరులతో మాట్లాడుతూ క్రీమీలేయర్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీమీలేయర్ మూలంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో తొమ్మిది శాతానికి రిజర్వేషన్లు మించడం లేదని అన్నారు.

02/14/2018 - 01:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఏ లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందకుండా నిరాకరించ వద్దని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు దక్కాల్సిందేదని, ఆధార్ సాకుతో తిరస్కరించ వద్దని కేంద్ర న్యాయ, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు.

02/13/2018 - 16:35

జమ్మూకశ్మీర్: శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. 24 గంటలపాటు సాగిన ఎదురుకాల్పుల్లో వారు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా కొందరు స్థానికులు భద్రతాదళాలపై రాళ్లు రువ్వారు. వారిని అక్కడి నుంచి తరిమివేసి సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. మరికొందరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉండవచ్చన్న అనుమానంతో సైనికులు గాలింపుచర్యలు చేపట్టారు.

02/13/2018 - 15:26

కొచ్చి: కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డులో ఓఎన్‌జీసీకి చెందిన సాగర్ భూషణ్ అనే నౌకను శుభ్రంచేస్తుండగా వాటర్ ట్యాంకు వద్ద భారీపేలుడు చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నౌకలో మరో ఇద్దరు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు.మంటలు అదుపులోకి వచ్చాయనీ.. ఊపరాడని కారణంగానే బాధితులు మృతిచెందారని పోలీసులు వెల్లడించారు.

02/13/2018 - 12:51

న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లో తీవ్రవాదులు, భద్రతా దళాల మధ్య నిన్న మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సంజ్వాన్ దాడి తరహాలోనే ఇక్కడికి సమీపంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపు‌పై దాడిచేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

Pages